Shan Masood : పాకిస్థాన్ వైస్ కెప్టెన్ షాన్ మసూద్ వివాహం పెషావర్‌లో శుక్రవారం జరిగింది. ప్రేయసి నిషే ఖాన్‌ను అతను పెళ్లి చేసుకున్నాడు. వీళ్ల వివాహ వేడుకకు చీఫ్ సెలక్టర్ షాహిద్ ఆఫ్రీదీ, ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ హాజరయ్యారు. జనవరి 27న కరాచీలో రిసెప్షన్ జరగనుంది. మసూద్ – నిషే పెళ్లి ఫొటోలను డా ఆర్టిస్ట్ అనే ఫొటోగ్రాఫర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దాంతో, ఈ కొత్త జంటకు మాజీ క్రికెటర్లు కమ్రాన్ అక్మల్, ఇఫ్తికార్ అహ్మద్‌తో పాటు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. మసూద్ – నిషే పెళ్లి ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో మసూద్, నిషేతో తన రిలేషన్షిప్ గురించి ప్రస్తావించాడు. నిషే తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, ఆమెను మొదటిసారిగా లాహోర్‌లో కలిశానని చెప్పుకొచ్చాడు. మిడిలార్డర్ బ్యాటర్ అయిన మసూద్ టీ20 వరల్డ్ కప్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. పాకిస్థాన్ జట్టులో టాప్ స్కోరర్‌గా తనే. భారత్ మీద హాఫ్ సెంచరీ (52)తో నాటౌట్‌గా నిలిచాడు. ఫైనల్లో ఇంగ్లండ్‌పై 38 రన్స్ చేశాడు.