LSG vs KKR : ఆదివారం డబుల్ హెడర్‌లో రెండో మ్యాచ్ అనూహ్యంగా సూపర్ ఓవర్ వరకూ వెళ్లింది. కోల్‌కతా నైట్ రైడర్స్ 155కే పరిమితం చేసిన లక్నో సూపర్ జెయింట్స్ తడబడుతూ ఆడినా.. రిషభ్ పంత్(42) పోరాడినా.. ఇంప్యాక్ట్ సబ్ హిమ్మత్ సింగ్(19) మెరుపులతో కోలుకుంది. కానీ, వరుణ్ చక్రవర్తి(2-33), వైభవ్ అరోరా(2-24)లు వికెట్ల వేటతో మ్యాచ్‌ను మలుపు తిప్పారు. అయితే.. కార్తిక్ త్యాగి వేసిన ఆఖరి బంతికి షమీ(11 నాటౌట్) సిక్సర్ బాదడంతో స్కోర్లు సమం అయ్యాయి. విజేతను నిర్ణయించేందుకు ఈ సీజన్లో తొలిసారి సూపర్ ఓవర్ ఆడించనున్నారు.
కోల్‌కతాను 155కే కట్టడి చేసిన లక్నో ఇన్నింగ్స్ సైతం తడబడుతూ సాగింది. మిచెల్ మార్ష్(2)ను షార్ట్ పించ్ బంతితో వైభవ్ అరోరా బోల్తా కొట్టించాడు. క్రీజులో కుదురుకున్న మర్క్రమ్(31) గ్రీన్ ఓవర్లో భారీ షాట్ ఆడగా బౌండరీ లైన్ వద్ద రింకూ సింగ్ అద్భుత క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. కాసేపటికే నరైన్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడబోయిన రిషభ్ పంత్(42) వికెట్ కీపర్ సీఫర్ట్ చేతికి చిక్కడంతో లక్నో కష్టాల్లో పడింది. ప్రత్యర్థి జట్టును మరింత కష్టాల్లో పడేస్తూ డేంజరస్ నికోలస్ పూరన్(9)ను పక్కా ఫీల్డింగ్ మార్పులతో వరుణ్ డగౌట్ చేర్చాడు. కీలక వికెట్లు పడిన వేళ ఆయుశ్ బదొని(24), ముకుల్ చౌదరీ(౦లు గెలుపు బాధ్యత తీసుకోవాలనుకున్నారు. కానీ, అనుకుల్ రాయ్ ఓవర్లో సిక్సర్‌కు యత్నించిన ముకుల్ రింకూ చేతికి దొరికాడు. ఇంప్యాక్ట్ సబ్ హిమ్మత్ సింగ్(19) సిక్సర్‌తో ఆశలు రేపగా.. బదొనిని చక్రవర్తి వెనక్కి పంపాడు. 12 బంతుల్లో 28 రన్స్ అవసరమైన వేళ.. షమీ, హిమ్మత్ చెరో ఫోర్ కొట్టారు. చివరి ఓవర్లో హిమ్మత్ ఔటైనా.. ఆఖరి బంతికి షమీ సిక్సర్ బాదగా స్కోర్లు సమమయ్యాయి.
మరోసారి బ్యాటింగ్ వైఫల్యాన్ని కొనసాగించింది కోల్‌కతా నైట్ రైడర్స్. లక్నో గడ్డపై మొహ్సిన్ ఖాన్(5-23) నిప్పులు చెరగడంతో కోల్‌కతా టాపార్డర్ కుప్పకూలింది. టిమ్ సీఫర్ట్(0), అజింక్యా రహానే(10)లను ఔట్ చేసి షాకిచ్చిన మొహ్సిన్ కోల్‌కతా శుభారంభం ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ సీజన్లో దంచేస్తున్న యువకెరటం రఘువంశీ(9) ఫీల్డింగ్‌కు అడ్డుపడినందున థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. కాసేపటికే రొవ్మన్ పావెల్(9)ను వెనక్కి పంపిన మొహ్సిన్ కోల్‌కతాను పవర్ ప్లేలోనే పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు.
Mohd. Shami to the rescue! 🔥
He hits a SIX OFF THE LAST BALL and we are heading to the first 𝗦𝗨𝗣𝗘𝗥 𝗢𝗩𝗘𝗥 of the season! 🤩
Updates ▶️ https://t.co/elFxwvCeWO#TATAIPL | #KhelBindaas | #LSGvKKR pic.twitter.com/OLER9RyiIy
— IndianPremierLeague (@IPL) April 26, 2026
మొహ్సిన్ విజృంభణతో 31కే నాలుగు వికెట్లు పడిన వేళ.. కామెరూన్ గ్రీన్(34), రింకూ సింగ్(83 నాటౌట్)లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ, గ్రీన్‌ను సైతం వెనక్కి పంపిన మొహ్సిన్ కోల్‌కతాను ఆలౌట్ అంచున నిలిపాడు. అయితే.. రమన్‌దీప్ సింగ్(6)తో కలిసి రింకూ జట్టుకు గౌరవప్రదమైన స్కోరందించే బాధ్యత తీసుకున్నాడు. కానీ, లక్నో బౌలర్లు బౌండరీలు బాదేందుదుకు అవకాశమివ్వకపోవడంతో కోల్‌కతా స్కోర్ 130 దాటుడే కష్టమనిపించింది. అయితే.. 2023 యశ్ దయాల్‌ను ఉతికేసినట్టే.. దిగ్వేశ్ రథీ వేసిన ఇన్నింగ్స్ రింకూ సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఆఖరి ఓవర్లో నాలుగు బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపడంతో కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి155 పరుగులు చేయగలిగింది.