Karoline Leavitt | ట్రంప్ మాటల తూటాలు పేలుతాయ్ అంటే.. తుపాకీ తూటాలే పేలాయ్..!
Karoline Leavitt | వాషింగ్టన్ డీసీ (Washington DC) లోని హిల్టన్ హోటల్ (Hilton Hotel) లో నిర్వహించిన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ మీటింగ్ (White Correspondents Dinner Meet) లో కాల్పులు జరగడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఆ కాల్పుల ఘటనకు కొన్ని గంటల ముందు ఓ మీడియా సంస్థతో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ (White House Press Secretory) కరోలిన్ లీవిట్ (Karoline Leavitt) మాట్లాడుతూ చేసిన సరదా వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
Karoline Leavitt : వాషింగ్టన్ డీసీ (Washington DC) లోని హిల్టన్ హోటల్ (Hilton Hotel) లో నిర్వహించిన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ మీటింగ్ (White Correspondents Dinner Meet) లో కాల్పులు జరగడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఆ కాల్పుల ఘటనకు కొన్ని గంటల ముందు ఓ మీడియా సంస్థతో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ (White House Press Secretory) కరోలిన్ లీవిట్ (Karoline Leavitt) మాట్లాడుతూ చేసిన సరదా వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసే ప్రసంగాన్ని ఉద్దేశించి ఈ రాత్రికి కొన్ని తూటాలు పేలనున్నాయ్ అని వ్యాఖ్యానించారు.
అయితే ఆమె ఆ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే నిజమైన తూటాలు పేలాయి. దాంతో ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ మీట్‌కు ముఖ్య అతిథిగా రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ప్రసంగిస్తారని ఆమె చెప్పారు. ఆయన ప్రసంగం చాలా ఫన్నీగా, ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పింది. సమావేశ మందిరంలో మాటల తూటాలు పేలుతాయ్ అని వ్యాఖ్యానించింది. ‘చూస్తూనే ఉండండి. నేను కూడా ట్రంప్ ప్రసంగం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’ అని కరోలిన్ లీవిట్ అన్నారు.
పదునైన రాజకీయ పదజాలంతో ట్రంప్ ప్రసంగం ఉంటుందనే ఉద్దేశంతో లీవిట్ ఇలా సరదాగా వ్యాఖ్యానించారు. కానీ ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆ ప్రాంగణంలోకి ప్రవేశించిన ఓ సాయుధ దుండగడు కాల్పులు జరిపి హంగామా సృష్టించాడు. ట్రంప్ మాటల తూటాలు పేలుతాయని ఆమె అంటే.. ఆ తర్వాత కొన్ని గంటలకే నిజమైన తుపాకీ తూటాలు పేలడం చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

