అక్తర్, షమీ మధ్య ‘కర్మ’ వివాదం.. రియాక్ట్ అయిన అఫ్రిది
akhtar-shami-afridi:పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయెబ్ అక్తర్, టీమిండియా ఫాస్ట్ బౌలర్ షమీ మధ్య ట్విట్టర్లో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. మెల్బోర్న్లో జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో పాకిస్థాన్ జట్టు ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. అయితే పాక్ ఓటమిపై అక్తర్ స్పందిస్తూ పగిలిన గుండె ఎమోజీని ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌కు షమీ రియాక్ట్ అయ్యాడు. సారీ బ్రదర్, దీన్ని కర్మ అంటారని షమీ ట్వీట్ చేశాడు. అయితే షమీ చేసిన ట్వీట్‌కు అక్తర్ రిప్లై
మెల్బోర్న్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయెబ్ అక్తర్, టీమిండియా ఫాస్ట్ బౌలర్ షమీ మధ్య ట్విట్టర్లో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. మెల్బోర్న్లో జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో పాకిస్థాన్ జట్టు ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. అయితే పాక్ ఓటమిపై అక్తర్ స్పందిస్తూ పగిలిన గుండె ఎమోజీని ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌కు షమీ రియాక్ట్ అయ్యాడు. సారీ బ్రదర్, దీన్ని కర్మ అంటారని షమీ రిప్లై ట్వీట్ చేశాడు. అయితే షమీ చేసిన ట్వీట్‌కు అక్తర్ కూడా రిప్లై ఇచ్చాడు. సున్నితమైన ట్వీట్ ఎలా చేయాలో తెలుసుకోవాలంటూ షమీకి మరో ట్వీట్ చేశాడు. పాక్ ఓడిన తీరుపై కామెంటేటర్ హర్షాబోగ్లే చేసిన కామెంట్‌ను ఆ ట్వీట్లో చెప్పాడు. అక్తర్, షమీ మధ్య జరిగిన ట్వీట్ జగడంపై పాక్ మాజీ బౌలర్ షాహిద్ అఫ్రిది స్పందించాడు
Sorry brother
It’s call karma 💔💔💔 https://t.co/DpaIliRYkd
— 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) November 13, 2022
మాజీ క్రికెటర్ అక్తర్, బౌలర్ షమీలు ఒకరిపై ఒకరు అలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. క్రికెటర్లు దూతల్లాంటివారని, ఇండియా-పాకిస్థాన్ మధ్య ఉన్న వైరాన్ని క్రికెటర్లు పోగొట్టాలని, ఇలాంటివి జరగకూడదని, ఎందుకంటే అది ప్రజల మధ్య ద్వేషాన్ని పెంచుతుందని అఫ్రిది అన్నాడు. మనమే ఇలా చేస్తే సాధారణ ప్రజలు, చదువుకోని వారు ఎలా ప్రవర్తిస్తారని ప్రశ్నించారు. బంధాల్ని పెంచుకోవాలని, క్రీడల ద్వారా ఆ బంధం ఎప్పటికీ బలపడుతుందని, భారత్‌తో ఆడాలని ఉందని, వాళ్లు పాక్‌లో టూర్ చేయాలని అఫ్రిది తెలిపాడు. సామా టీవీతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
https://twitter.com/shoaib100mph/status/1591787400019181577?s=20&t=K5si8oUjMNqwhYf4pvMqFw
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

