Shakib Al Hasan: అభిమాని చెంప చెల్లు.. మరో కాంట్రవర్సీలో బంగ్లాదేశ్ ఎంపీ..
Shakib Al Hasan: మగుర-1 నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన షకిబ్.. లక్షా యాభై వేల మెజారిటీతో గెలిచినా క్రికెట్లో మాదిరిగానే రాజకీయాలలో కూడా అతడి వ్యవహార శైలి చర్చనీయాంశమవుతోంది.
Shakib Al Hasan: బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికలలో పోటీచేసి అధికార అవామీ లీగ్ పార్టీ తరఫున గెలిచిన ఆ దేశ క్రికెట్ జట్టు సారథి షకిబ్ అల్ హసన్ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తలలో నిలిచాడు. మగుర-1 నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన షకిబ్.. లక్షా యాభై వేల మెజారిటీతో గెలిచినా క్రికెట్లో మాదిరిగానే రాజకీయాలలో కూడా అతడి వ్యవహార శైలి చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల సందర్భంగా ఓ పోలింగ్ బూత్ పరిశీలనకు వెళ్లిన షకిబ్.. అభిమాని చెంప చెల్లుమనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
వీడియోలో పోలింగ్ కేంద్రానికి వెళ్లిన షకిబ్.. అక్కడ గుమిగూడిన జనాలను తోసుకుంటూ ముందుకు వెళ్లబోయాడు. అయితే అక్కడే ఉన్న ఓ అభిమాని.. అతడిని వెనక నుంచి పట్టుకోబోయాడు. అప్పటికే చికాకుగా ఉన్న షకిబ్.. అసహనంతో అభిమాని చెంపపై బలంగా కొట్టాడు. షకిబ్ అతడిపై చేయి చేసుకోవడంతో అక్కడున్నవారంతా వెంటనే అక్కడ్నుంచి తప్పుకున్నారు. షకిబ్ గెలిచిన తర్వాత ఈ వీడియో వైరల్ అవుతుండటంతో ప్రత్యర్థులతో పాటు నెటిజన్లు కూడా ఎంపీ అయినా షకిబ్ వ్యవహార శైలిలో మాత్రం ఏ మార్పూ రాలేదని వాపోతున్నారు.
Shakib Al Hasan finally lost his calm ❌#shakibalhasan #cricket #bangladesh pic.twitter.com/rmVKbSkrol
— Cricketangon (@cricketangon) January 7, 2024
షకిబ్ ఇలా దుందుడుకు ప్రవర్తనతో వార్తల్లో నిలవడం ఇదే కొత్త కాదు. ఈ ఏడాది ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న షకిబ్.. తనను కలవడానికి వచ్చిన ఓ అభిమానిపై చేయి చేసుకున్నాడు. ఇక కొద్దిరోజుల క్రితమే వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో లంక మాజీ సారథి ఏంజెలో మాథ్యూస్‌ను ‘టైమ్డ్ ఔట్’ అప్పీల్ చేయడంతో షకిబ్ విమర్శలపాలయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

