కాన్పూర్: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్(Shakib Al Hasan).. టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. తక్షణమే తన నిర్ణయం అమలులోకి వస్తుందన్నారు. ఒకవేళ స్వదేశంలో ఫేర్మ్యాచ్ లేకుంటే, అప్పుడు కాన్పూర్‌లో భారత్‌తో జరిగే రెండో టెస్టు మ్యాచ్ తనకు చివరిది అవుతుందని పేర్కొన్నారు. 37 ఏళ్ల షకీబ్ 129 టీ20లు ఆడారు. టీ20 వరల్డ్‌కప్ సమయంలోనే చివరి టీ20 మ్యాచ్ ఆడేశానని, సెలెక్టర్లతో ఈ అంశాన్ని చర్చించానని, 2026 వరల్డ్‌కప్‌ను గమనిస్తే, ఇక జట్టు నుంచి తప్పుకోవడం సబబే అని అర్థమవుతోందన్నారు. షకీబ్ మొత్తం 69 టెస్టులు ఆడాడు. వాటిల్లో 4453 పరుగులు చేశాడు. 242 వికెట్లు కూడా తీశాడు. మీర్పూర్లో చివరి టెస్టు ఆడాలన్న కోరికను క్రికెట్ బోర్డుకు చెప్పానని, వాళ్లు అంగీకరించారని, బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని, ఒకవేళ అలా జరగకుంటే, కాన్పూర్‌లో భారత్‌తో జరిగే టెస్టు తనకు చివరిదని తెలిపారు. ఇటీవల బంగ్లాదేశ్‌లో షకీబ్ హసన్‌పై మర్డర్ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.