కరాచీ: పాకిస్థాన్ స్టార్ పేస్ బౌలర్ షాహీన్ అఫ్రిది .. ఆ దేశ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. కరాచీలో జరిగిన సెర్మనీలో అన్షాను పెళ్లాడాడతను. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో పాటు అనేక మంది క్రికెటర్లు ఆ వేడుకకు హాజరయ్యారు. గత ఏడాదే అన్షాతో షాహీన్ ఎంగేజ్మెంట్ జరిగింది. లాహోర్ క్వలాండర్స్ జట్టు పెళ్లికి సంబంధించిన ఫోటోలను ట్వీట్ చేసింది.
"Qabool Hai, Qabool Hai"#NewBeginings #ShaheenShahAfridi pic.twitter.com/4kiswYI0iG
— Lahore Qalandars (@lahoreqalandars) February 3, 2023
బాబర్ ఆజమ్, సర్ఫరాజ్ ఖాన్, షాదాబ్ ఖాన్, నసీమ్ షాలు ఈ పెళ్లికి హాజరయ్యారు. గత ఏడాది టీ20 వరల్డ్‌కప్ సమయంలో షాహీన్ అఫ్రిదికి మోకాలి గాయమైన విషయం తెలిసిందే. 22 ఏళ్ల క్రికెటర్ చాలా రోజుల పాటు రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు. ఓ దశలో క్రికెట్‌ను వీడాలనుకున్నానని, కానీ తన వీడియోలను యూట్యూబ్‌లో చూసుకుని మోటివేట్ అయినట్లు షాహీన్ తెలిపాడు.
ఫిబ్రవరి 13వ తేదీ నుంచి జరగనున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ 8వ ఎడిషన్‌లో లాహోర్ జట్టు తరపున షాహీన్ ఆడనున్నాడు. గత ఏడాది షాహీన్ నేతృత్వంలోని లాహోర్ జట్టుకు పీఎస్ఎల్ టైటిల్ దక్కింది.