Shaheen Afridi | పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహిన్ ఆఫ్రిది ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. త్వరలోనే పెళ్లి కొడుకు కానున్నాడు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహీద్ ఆఫ్రిది కుమార్తె ఆన్షాను షాహిన్ వివాహం చేసుకోబోతున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన ఈ జంట ఒక్కటి కానున్నారు. నిఖా కార్యక్రమం కరాచీలో జరగనుంది.
2021లో ప్రతిష్టాత్మక ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్న మొదటి పాకిస్థానీ ప్లేయర్గా షాహిన్ నిలిచాడు. షాహిన్ ఆఫ్రిది ఇప్పటి వరకు 25 టెస్టుల్లో 99 వికెట్లు, 32 వన్డేల్లో 62 వికెట్లు, టీ20ల్లో 58 వికెట్లు తీశాడు. అపెండిసైటిస్ ఆపరేషన్ కారణంగా.. షాహిన్ ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉంటున్నాడు.