న్యూఢిల్లీ: ఐపీఎల్లో ఆదిలోనే చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఐకాన్ ప్లేయర్ మహేంద్రసింగ్ ధోనీ గాయం కారణంగా రెండు వారాల పాటు ఆటకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని చెన్నై యాజమాన్యం శనివారం ఒక ప్రకటనలో అధికారికంగా పేర్కొంది. ‘ధోనీ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు.
పూర్తిగా కోలుకునేందుకు దాదాపు రెండు వారాల సమయం పట్టే అవకాశముంది. దీంతో లీగ్‌లో కొన్ని మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండటం లేదు’ అని చెన్నై తెలిపింది. ఐపీఎల్ మొదలైన 2008 నుంచి ఆడుతున్న 44 ఏండ్ల ధోనీ..చెన్నై ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలువడంలో కీలకంగా వ్యవహరించాడు. ప్రతీ సీజన్ ప్రారంభానికి ముందు ధోనీ రిటైర్మెంట్పై ఊహాగానాలు మొదలవుతూనే ఉంటాయి. ఈసారి కూడా ధోనీ ఆఖరి ఆట ఆడేస్తాడా అంటూ చర్చ జరుగుతున్నది.