వాషింగ్టన్: అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ సంతోషకరమైన సందర్భాన్ని తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా సెరెనా అభిమానులతో పంచుకుంది.
అడిరా రివర్ ఒహానియన్గా పాపకు నామకరణం చేసినట్లు పోస్ట్‌లో రాసుకొచ్చింది. టెన్నిస్ చరిత్రలో 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు దక్కించుకున్న సెరెనా గత ఏడాది కాలంగా ఆటకు దూరమైంది.