శాన్ఫ్రాన్సిస్కో: తాను టెన్నిస్ నుంచి రిటైర్ కాలేదని, తిరిగి బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత సెరెనా విలియమ్స్ ప్రకటించింది. గత ఆగస్టులో తాను త్వరలో టెన్నిస్‌కు వీడ్కోలు పలుకనున్నట్టు పరోక్షంగా వెల్లడించిన సెరెనా యూఎస్ ఓపెన్ మూడో రౌండ్ ఓటమి అనంతరం తిరిగి ఏ టోర్నీలోనూ పాల్గొనలేదు. సోమవారం తన వ్యాపార అభివృద్ధి సమావేశంలో తాను టెన్నిస్‌కు రిటైర్మెంట్ చెప్పలేదని, తన ఇంట్లో ఇంకా టెన్నిస్ కోర్టు ఉందని, అందులో సాధన చేస్తున్నానని తెలిపింది. తన ఆటకు సరిపడే టోర్నీలో పాల్గొనేందుకు వేచి చూస్తున్నానని తెలిపింది.