Serena Williams : టెన్నిస్ ఆటలో రోజర్ ఫెదరర్(Roger Federer) ఎంత గొప్పవాడో తెలిసిందే. ఈ స్విట్జర్లాండ్ ఆటగాడు తన సొగసైన షాట్లతో ఆటకే అందం తెచ్చాడు. అంతటి ఆటగాడిపై అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్(Serena Williams) షాకింగ్ కామెంట్స్ చేసింది. తన కంటే ఫెదరర్ ఏమంత గొప్పవాడు కాదని, ఆ విషయం గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల(Grandslam Titles)ను చూస్తే స్పష్టమవుతుందని అంది. ‘ఫెదరర్ కేవలం 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచాడంతే. నేను 23 గ్రాండ్స్స్లామ్స్ సాధించాను’ అని సెరెనా తెలిపింది.
అయితే.. ఆమె సహచరుడు ఫ్రాన్సెస్ టియఫో(Frances Tiafoe) మాత్రం సెరెనా వ్యాఖ్యల్ని కొట్టిపారేశాడు. 2019లో జరిగిన హాప్‌మన్ కప్(Hopman Cup) మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌ను అతను గుర్తు చేశాడు. ‘ఆ మ్యాచ్లోకోర్టు నలువైపులా షాట్లు కొట్టిన ఫెదరర్ సెరీనాకు చుక్కలు చూపించాడు. అతడి జోరు ముందు మేము తలవంచాం’ అని చెప్పకొచ్చాడు. ఆరోజు ఫెదరర్ – బెలిండా బెన్సిక్ జోడీ సెరీనా – టియఫోను చిత్తుగా ఓడించింది.
సెరీనా – టియఫోను ఓడించిన ఫెదరర్ – బెలిండా బెన్సిక్ జోడీ

పురుషుల సింగిల్స్‌లో ఫెదరర్ మకుటం లేని మహరాజుగా వెలుగొందుతున్న రోజుల్లోనే.. సెరెనా మహిళల సింగిల్స్‌లో సంచలన విజయాలు సాధించింది. వీళ్లిద్దరూ పోటాపోటీగా టైటిళ్లు సాధిస్తూ నంబర్ 1 ర్యాంక్‌కు చేరారు. అక్క వీనస్ విలియయ్స్(Venus Williams)తో కలిసి సింగిల్స్, డబుల్స్‌లో గ్రాండ్ స్లామ్ టైటిళ్లు కొల్లగొట్టింది. ఓవైపు వివక్షను ఎదుర్కొంటూనే ఆటలో ఉన్నత శిఖరాలకు చేరింది.
గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలతో సెరీనా

ఆమె ఖాతాలో 23 సింగిల్స్, 14 డబుల్స్ టైటిళ్లు ఉన్నాయి. గాయాలు వెంటాడుతుండడంతో 2022 సెప్టెంబర్‌లో టెన్నిస్ నుంచి తప్పుకుంది. మరోవైపు.. రఫెల్ నాదల్, నొవాక్ జకోవిచ్ రాకతో ఫెదరర్ జోరుకు బ్రేక్ పడింది. దానికి తోడూ వయసు మీద పడడంతో అతను రెండేళ్ల క్రితం టెన్నిసకు వీడ్కోలు పలికాడు.