లండన్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరుగుతున్నది. ఈ నెల 6న ప్రారంభమైన మ్యాచ్ 10న ముగియనుంది. అయితే మూడో టెస్టు మొదటి రోజు ఆఖరి సెషన్లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఓపెనింగ్ బ్యాటర్ బెన్ డక్కెట్ కొట్టిన బంతిని ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ మూతితో క్యాచ్ పట్టుకున్నాడు.
మూతితో క్యాచ్ ఎలా పట్టుకుంటారని ఆలోచిస్తున్నారా..? కానీ అదే జరిగింది. డక్కెట్ కొట్టిన బంతిని వికెట్ల వెనుక ఉన్న అలెక్స్ క్యారీ డైవ్ చేసి చేతులతో ఒడిసిపట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఆ బంతి క్యారీ చేతికి సరిగ్గా అందకుండా మునివేళ్లలో చిక్కింది. దాంతో క్యారీ ఆ బంతి కింద పడిపోకుండా మూతితో అదిమిపెడుతూనే డైవ్ పూర్తిచేశాడు. ఆ తర్వాత వెల్లకిలా పడిపోతూ ఆ బంతిని పూర్తిగా చేతి వేళ్లలోకి తీసుకున్నాడు.
అలెక్స్ క్యారీ ఈ విచిత్రమైన క్యాచ్ అందుకోగానే కామెంటరీ బాక్స్‌లో ఉన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతూ స్వరం మరింత పెంచి కామెంట్ చేశాడు. ‘వావ్..! అది కచ్చితంగా స్మూచ్. నువ్వు నువ్వే అలెక్స్ క్యారీ (ఓహ్.. దట్స్ డెఫినైట్లీ ఎ స్మూచ్. బిహేవ్ యువర్సెల్ఫ్, అలెక్స్ క్యారీ)’ అని వ్యాఖ్యానించాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
Morgan 🤣#ashes pic.twitter.com/8AyqpFSkWK
— mon (@4sacinom) July 6, 2023