ముంబై : ఆసియాకప్ టోర్నీకి భారత జట్టు(Team India) ఎంపికపై కసరత్తు మొదలైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో సూర్యకుమార్ యాదవ్ కూడా పాల్గొన్నాడు. ఆసియా కప్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగబోతున్న భారత్ జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ముంబైలో వర్షాలు పడుతున్న కారణంగా.. సెలక్షన్ ప్యానల్ మీటింగ్ ఆలస్యమైంది. బీసీసీఐ కార్యదర్శి దేవదత్ సైకియాతో పాటు మరికొంత మంది సెలక్టర్లు పాల్గొన్నారు.
📸 The Selection Committee Meeting for #TeamIndia #AsiaCup squad selection is underway! pic.twitter.com/GAlpyDlzyf
— BCCI (@BCCI) August 19, 2025
ఓపెనర్‌గా గిల్‌ను తీసుకుంటారా లేక జైస్వాల్‌ను తీసుకుంటారా అన్న అంశంపై తర్జనభర్జన జరుగుతున్నది. మరో బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌ను ఎంపిక చేస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.