Aaryavir Sehwag : దిగ్గజ క్రికెటర్ల వారసులు మైదానంలో చెలరేగిపోతున్నారు. తమ తండ్రులను తలపించే బ్యాటింగ్‌తో అభిమానులను అలరిస్తున్నారు. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ Virender Sehwag కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ (Aryavir Sehwag) అచ్చం తండ్రిలానే విధ్వంసక ఇన్నింగ్స్‌లతో ‘శెభాష్’ అనిపించుకుంటున్నాడు. నిరుడు నవంబర్‌లో కూచ్ బెహర్ ట్రోఫీ (Cooch Behar Trophy)లో చెలరేగి ఆడిన ఆర్యవీర్ 3 పరుగుల తేడాతో ట్రిపుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఇప్పుడు ఈ యువకెరటం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో బౌండరీల మోతతో విరుచుకుపడ్డాడు.
ధిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఆర్యవీర్ సెహ్వాగ్ మెరుపులు మెరిపిస్తున్నాడు. వేలంలో రూ. 8లక్షలు పలికిన ఈ పదిహేడేళ్ల కుర్రాడు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ (Central Delhi Kings) తరఫున ధనాధన్ బ్యాటింగ్‌తో బౌలర్లను భయపెడుతున్నాడు. ఆగస్టు 27న అరుణ్ జైట్లీ మైదానంలో ఈ చిచ్చరపిడుగు ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ (East Delhi Riders)బౌలర్లకు చుక్కలు చూపిస్తూ నాలుగు బౌండరీలు బాదాడు. టీమిండియా పేసర్ నవ్‌దీప్ సైనీ ఓవర్లో ఆర్యవీర్ కవర్ డ్రైవ్‌తో రెండు ఫోర్లు కొట్టడం విశేషం. 16 బంతుల్లోనే 22 రన్స్ చేసిన ఆర్యవీర్ క్రీజులో ఉన్నంత సేపు తన తండ్రి వీరూలానే దూకుడుగా ఆడాడు. దాంతో.. కొన్నేళ్ల క్రితం ఇదే స్టేడియంలో సెహ్వాగ్ ఆడిన ఆటను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు.
A brilliant debut by Aaryavir Sehwag in the Delhi Premier League! 🏏
Aaryavir Sehwag | East Delhi Riders | Central Delhi Kings | Anuj Rawat | Jonty Sidhu | #DPL2025 #DPP #AdaniDPL2025 #Delhi pic.twitter.com/Dxs5E2uFqu
— Delhi Premier League T20 (@DelhiPLT20) August 27, 2025
నిరుడు కూచ్ బెహర్ ట్రోఫీలో తన తనయుడు ట్రిపుల్ సెంచరీ మిస్ అయ్యాక వీరూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. పరుగులు సాధించాలనే కసిని అలాగే కొనసాగించాలని, డాడీ కంటే ఎక్కువ సెంచరీలు కొట్టాలని తన సుపుత్రుడిని సెహ్వాగ్ మనఃస్ఫూర్తిగా దీవించాడు. ‘ఆర్యవీర్ సెహ్వాగ్ చాలా అద్భుతంగా ఆడావు. 23 పరుగుల తేడాతో ఫెరారీని మిస్ అయ్యావు. అయినా పర్లేదు చాలా బాగా ఆడావు. నీలోని ఈ కసిని అలాగే కొనసాగించు. మీ డాడీ కంటే ఎక్కువ సెంచరీలు, ద్విశతకాలు, ట్రిపుల్ సెంచరీలు కొట్టు. ఇలానే ఆడుతూ ఉండు’ అని వీరూ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
కూచ్ బెహర్ ట్రోఫీలో ఢిల్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఆర్యవీర్ సెహ్వాగ్ ఎడాపెడా బౌండరీలు దంచేశాడు. మేఘాలయా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ శతకం సాధించాడు. అంతటితో ఆగకుండా తన విధ్వంసాన్ని కొనసాగిస్తూ ట్రిపుల్ సెంచరీకి చేరువయ్యాడు. అయితే.. అనూహ్యంగా 3 పరుగుల దూరంలో బౌల్డ్ అయ్యాడు. ఆర్యవీర్ మెరుపు ఇన్నింగ్స్‌లో 51 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.
Virender Sehwag’s son Aaryavir Sehwag made an impressive debut for Central Delhi Kings in the Delhi Premier League on Wednesday, scoring 22 off 16 balls 💥#DPL2025 #AaryavirSehwag pic.twitter.com/QDr4Rplj7I
— Circle of Cricket (@circleofcricket) August 28, 2025