IPL 2024 | రియాద్: ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రికెట్ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్‌పై సౌదీఅరేబియా యువరాజు కన్నేశాడు. లీగ్‌లో ఎలాగైనా ఫ్రాంచైజీని కొనుగోలు చేయాలన్న పట్టుదలతో ఉన్న యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆ దిశగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
గత సెప్టెంబర్‌లో భారత పర్యటనకు వచ్చిన సల్మాన్..భారత ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు బ్లూమ్‌బర్గ్ తమ కథనంలో పేర్కొంది.