హైదరాబాద్, ఆట ప్రతినిధి: అఖిల భారత సివిల్ సర్వీసెస్ చెస్ పోటీలకు సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుడు గుంటి సత్యనారాయణ ఎంపికయ్యారు. ఈనెల 10 నుంచి ఢిల్లీలో షురూ కానున్న ఈ టోర్నీలో మరోసారి రాష్ట్ర జట్టు తరఫున సత్యనారాయణ బరిలోకి దిగనున్నారు. పోతిరెడ్డిపల్లిలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ చదరంగంలో సత్తా చాటుతున్నారు. 2017-18లో జరిగిన ఈ టోర్నీలో తెలంగాణ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన సత్యనారాయణ.. 2018 ఒడిశాలో జరిగిన జాతీయ స్థాయి చెస్ టోర్నీలో పాల్గొన్నాడు. మరోసారి జాతీయ పోటీల్లో పాల్గొననున్న సత్యనారాయణను రాష్ట్ర చెస్ సంఘం, క్రీడా సంఘం ప్రతినిధులతో పాటు పాఠశాల సిబ్బంది అభినందించారు.