China Masters : భారత డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి ఖాతాలో మరో టైటిల్ చేరింది. చైనా మాస్టర్స్(China Masters) సెమీస్‌లో సంచలన విజయంతో ఫైనల్ చేరిన ఈ జోడీ.. ఆఖరి పోరులో చైనా జంటను చిత్తు చేసింది. ఆదివారం జరిగిన ఫైనల్లో హే జీ టింగ్ – రెన్ గ్జియాంగ్పై అద్భుతం విజయంతో విజేతగా నిలిచింది సాత్విక్ – చిరాగ్ జంట. తొలి సెట్ కోల్పోయినా ఆత్మవిశ్వాసం కోల్పోకని భారత జోడీ వరసగా రెండు సెట్లలో గెలుపొందింది. దాంతో.. చైనా షట్లర్లకు నిరాశే మిగిలింది.
చైనా మాస్టర్స్‌లో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి ద్వయం ఛాంపియన్‌గా నిలిచింది. పురుషుల డబుల్స్‌లో అంచనాలు అందుకుంటూ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత జంట ధాటికి చైనా షట్లర్లు చేతులెత్తేశారు. తొలి సెట్‌ను 11-21తో కోల్పోయిన సాత్విక్ జోడీ ఒత్తిడికి లోనవ్వలేదు. రెండో సెట్లో గొప్పగా ఆడి హే జీ టింగ్ – రెన్ గ్జియాంగ్కు 21-13తో షాకిచ్చింది. నిర్ణయాత్మక మూడో సెట్లోనూ భారత ద్వయం చెలరేగింది.
HISTORIC TITLE FOR SAT-CHI 🤩
Satwiksairaj Rankireddy and Chirag Shetty stage a remarkable comeback to win their maiden China Masters trophy 🏆
▶️ Their second S750 title in 2026 and fourth overall
▶️ Third time lucky at #ChinaMasters with two runners-up finishesDrop a 💪🏽… pic.twitter.com/LEazwR3TA8
— BAI Media (@BAI_Media) September 6, 2026
ఫలితంగా 21-17తో సెట్‌ను గెలుపొందడంతో పాటు టైటిల్‌నూ సొంతం చేసుకుందీ స్టార్ జోడీ. గతంలో రెండుసార్లు(2023, 2025) ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన సాత్విక్ చిరాగ్ .. ఈసారి తమ కలను సాకారం చేసుకుంటూ విజేతగా నిలిచారు. మొత్తంగా ఈసీజన్లో వీరికి ఇది రెండో టైటిల్. ఈమధ్యే ఈ జంట సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టైటిల్‌ను గెలిచింది.
After reaching two consecutive finals, India’s Satwiksairaj Rankireddy and Chirag Shetty have finally won the China Masters title!
The Indian duo showed incredible fighting spirit in the final. Trailing by four points at one stage in the deciding game, Satwik and Chirag produced… pic.twitter.com/Z0ehCOoEtl
— Three Courts (@threecourts) September 6, 2026