Hong Kong Open : ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యంతో మెరిసిన సాత్విక్ సాయిరాజ్ (Satwik Sairaj) – చిరాగ్ శెట్టి (Chirag Shetty) జోడీ మరో టైటిల్ వేటకు చేరువైంది. ప్రతిష్ఠాత్మక హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో ఈ స్టార్ జంట సంచలన ప్రదర్శనతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం హోరాహోరీగా జరిగిన మూడు సెట్ల పోరులో జునైదీ అరిఫ్ – రాయ్ కింగ్ యాప్ (మలేషియా)లను చిత్తు చేసింది. దాంతో.. వరుసగా రెండో టోర్నమెంటల్లో సెమీస్ బెర్తు కైవసం చేసుకుందీ భారత స్టార్ ద్వయం.
హాకాంగ్ ఓపెన్‌లో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడీ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. 42వ ర్యాంక్ జోడీని మట్టికరిపించి క్వార్టర్ ఫైనల్ చేరిన ఈ ద్వయం అదే దూకుడు చూపించింది. బలమైన ఆటాకింగ్తో భారత జంటకు చెక్ పెట్టాలని భావించిన జునైదీ అరిఫ్ – రాయ్ కింగ్ యాప్‌లకు చుక్కలు చూపించింది. ప్రత్యర్థి ఎత్తుల్ని చిత్తు చేస్తూ తొలి సెట్‌ను సాత్విక్ -సాయిరాజ్ 21-14తో కైవసం చేసుకున్నారు.
🔥 From the highs of the World Championship to Hong Kong – the World 9s are on a roll! 💥
The Smash Brothers keep the momentum going with a knockout show! 🏸⚡#Badminton #World9s #SmashBrothers pic.twitter.com/O4jd62BkFC— BAI Media (@BAI_Media) September 12, 2025
అయితే.. రెండో సెట్లో అటాకింగ్ గేమ్‌తో మలేషియా షట్లర్లు 22-20తో పైచేయి సాధించారు. దాంతో.. మూడో సెట్ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. నిర్ణయాత్మకమైన ఈ సెట్లో సాత్విక్ – చిరాగ్ జోడీ టాప్ గేర్‌లో ఆడింది. తమదైన శైలిలో దూకుడు కనబరిచి జునైదీ – రాయ్ కింగ్ జంట సెమీస్ ఆశలపై నీళ్లు చల్లింది. ఈ ఏడాది తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ వేటలో ఉన్న ఈ జోడీ శనివారం లిన్ బింగ్ వీ – చెన్ చెంగ్ కౌన్ (చైనీస్ తైపీ)తో తలపడనుంది.
. #smashbros in action#badminton https://t.co/ezl7lxVezP
— BAI Media (@BAI_Media) September 12, 2025