BWF Rankings | సాత్విక్ – చిరాగ్ జోడీకి షాక్.. సింధు ర్యాంక్ ఎంతంటే..?
BWF Rankings : భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ (Satwik Sairaj) - చిరాగ్ శెట్టి (Chirag Shetty)కి పెద్ద షాక్. ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న ఈ స్టార్ ద్వయం నంబర్ 1 ర్యాంక్ కోల్పోయింది.
BWF Rankings : భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్(Satwik Sairaj) – చిరాగ్ శెట్టి(Chirag Shetty)కి పెద్ద షాక్. ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న ఈ స్టార్ ద్వయం నంబర్ 1 ర్యాంక్ కోల్పోయింది. మంగళవారం అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య(BWF) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సాత్విక్ – చిరాగ్ జంట మూడో స్థానంలో నిలిచింది. చైనాకు చెందిన లియాంగ్ వీ కెంగ్, వాంగ్ చాంగ్‌లు అగ్రస్థానం సొంతం చేసకున్నారు. డెన్మార్క్ డబుల్స్ జోడీ కింగ్ అస్ట్రుప్, అండర్స్ స్కారుప్ రస్ముస్సెన్కు రెండో స్థానం దక్కింది.
నిరుడు మేలో థాయ్‌లాండ్ ఓపెన్ విజయంతో చిరాగ్ – సాత్విక్ జోడీ నంబర్ 1 ర్యాంకుకు ఎగబాకింది. అయితే.. జూన్‌లో జరిగిన సింగపూర్ ఓపెన్ తొలి రౌండ్లోనే వెనుదిరగడం.. ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి వైదొలగడం కారణంగా వీళ్ల ర్యాంక్ మూడుకు పడిపోయింది. ఇక పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy), లక్ష్య సేన్లు టాప్ -15లో నిలిచారు. ప్రణయ్‌కు 10వ ర్యాంక్.. లక్ష్య సేన్‌కు 14వ ర్యాంక్ దక్కింది.
Career-high ranking for 🇩🇰 Kim Astrup and Anders Skaarup Rasmussen. 👏
Stort tillykke!
Full rankings 👉 https://t.co/9hRjmso7zU#BWFWorldRankings pic.twitter.com/zsUCZmVt8V
— BWF (@bwfmedia) June 11, 2024
సింధు స్థానం మారలే..
కిడాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) ఏకంగా నాలుగు స్థానాలు కోల్పోయి 32తో సరిపెట్టుకున్నాడు. యువకెరటాలు ప్రియాన్షు రజావత్ 34వ, కిరణ గోర్గెలు 35వ ర్యాంక్ సాధించారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు(PV Sindhu) తన ర్యాంక్ నిలబెట్టుకుంది. రెండేండ్లుగా ఒక్క టైటిల్ కూడా గెలవని ఆమె పదో స్థానంలో నిలవగా.. ప్యారిస్ ఒలిపింక్స్‌కు అర్హత సాధించిన తనీశా క్రాస్టో, అశ్విని పొన్నప్ప జోడీ 19వ ర్యాంక్‌లో నిలిచింది.

ఇవి కూడా చదవండి
- Revanth Reddy | సచివాలయంలోకి నార్త్ గేట్ నుంచి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. వీడియో
- Chandra Babu | ఏపీ గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన చంద్రబాబు
- Saulos Chilima | మలావి ఉపాధ్యక్షుడి గల్లంతు విషాదాంతం.. విమాన ప్రమాదంలో 10 మంది దుర్మరణం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

