Revanth Reddy | సచివాలయంలోకి నార్త్ గేట్ నుంచి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. వీడియో
Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పలు వాస్తు మార్పులు చేపట్టినట్లు వారం రోజుల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానంగా రాకపోకల మార్గాలకు సంబంధించిన వాస్తు ప్రకారం మార్పులు చేసినట్లు సమాచారం. అయితే ఈ వాస్తు మార్పులకు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలోకి ఎంట్రీ ఇచ్చిన వీడియోనే సాక్ష్యం.
Revanth Reddy | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పలు వాస్తు మార్పులు చేపట్టినట్లు వారం రోజుల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానంగా రాకపోకల మార్గాలకు సంబంధించిన వాస్తు ప్రకారం మార్పులు చేసినట్లు సమాచారం. అయితే ఈ వాస్తు మార్పులకు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలోకి ఎంట్రీ ఇచ్చిన వీడియోనే సాక్ష్యం.
నిన్న మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి.. సింహ ద్వారం నుంచి సచివాలయానికి వెళ్లేవారు. కానీ మంగళవారం మాత్రం సింహ ద్వారాన్ని మూసేశారు పోలీసులు. ఎన్టీఆర్ గార్డెన్‌కు అనుకొని ఉన్న నార్త్ గేట్ నుంచి సచివాలయంలోకి రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ముఖ్యమంత్రి కార్యాలయం ప్రస్తుతం 6వ అంతస్తులో ఉంది. దీన్ని ఇప్పుడు 9వ అంతస్తులోకి మార్చేందుకు పనులు చేపడుతున్నట్లు తెలిసింది. ఆగ్నేయ ద్వారం నుంచి ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారుల రాకపోకలు కొనసాగేలా ప్రభుత్వం మార్పులు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. సచివాలయం లోపల కూడా పలు మార్పులు చేపట్టినట్లు సమాచారం.
వాస్తు ప్రకారం సచివాలయంలో రూటు మార్చిన రేవంత్ రెడ్డి
వాస్తులో భాగంగా సచివాలయం సింహ ద్వారం మూసి వేసి నార్త్ గేటు నుండి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ రెడ్డి pic.twitter.com/f7vSkmmMb9
— Telugu Scribe (@TeluguScribe) June 11, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

