హైదరాబాద్, ఆట ప్రతినిధి: అమెరికా అండర్-19 మెన్స్ క్రికెట్ జట్టుకు ఎంపికైన నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన సుదిని నితీశ్ రెడ్డిని టీడీసీఏ ప్రెసిడెంట్, శాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి అభినందించారు. అమెరికాలో పుట్టిపెరిగిన నితీశ్.. క్రికెట్లో రాణిస్తున్నాడు.
నాగర్కర్నూల్లో జిల్లా నుంచి ఓ ఆటగాడు అమెరికా క్రికెట్ జట్టులో ఆడటం ఎంతో సంతోషమని ఈ సందర్భంగా వెంకటేశ్వరరెడ్డి అన్నారు. నితీశ్ స్ఫూర్తితో తెలంగాణలో మరింతమంది గ్రామీణ క్రికెటర్లు జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ఆయన ఆకాంక్షించారు.