హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి సహకరించాలని కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయాకు సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం గచ్చిబౌలి సాయ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన మంత్రికి వినతిపత్రం అందజేశారు. భవిష్యత్‌లో దేశంలో జరిగే మెగాటోర్నీల ఆతిథ్యంలో రాష్ర్టానికి అవకాశమివ్వాలని మంత్రిని కోరారు.
స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక చేస్తుందని, ఇందుకోసం కేంద్రం ఆర్థిక సహాయం అందించాలని కోరారు. గచ్చిబౌలి స్టేడియంతో పాటు సాయ్ శిక్షణా కేంద్రంలో వసతులను మాండవీయ పరిశీలించారు. అక్కడే శిక్షణ పొందుతున్న పారాలింపిక్స్ పతక విజేత దీప్తితో పాటు అథ్లెట్లను మంత్రి సన్మానించారు.