Sarfaraz Khan – Musheer Khan: గడిచిన రెండేండ్లుగా భారత జట్టులోకి ఎంట్రీ కోసం ఆరాటపడుతున్న సర్ఫరాజ్ ఖాన్ తనకు దొరికిన ప్రతీ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటున్నాడు. దేశవాళీతో పాటు ఇటీవలే ఇండియా ‘ఏ’ జట్టుకు ఆడుతున్న సర్ఫరాజ్.. ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులోనూ ఇరగదీశాడు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ (160 బంతుల్లో 161, 18 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ స్కోరు చేశాడు. అయితే సర్ఫరాజ్ ఫ్యామిలీకి మరో గుడ్ న్యూస్ కూడా అందింది.
అండర్ -19 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్ తరఫున ఆడుతున్న సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్ (106 బంతుల్లో 118, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా సెంచరీ బాదాడు. ఈ ఇద్దరూ ఒకే రోజు సెంచరీ చేయడంతో వీళ్ల తండ్రి, కోచ్‌గానూ ఉన్న నౌషద్ ఖాన్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నాడు. బంగ్లాదేశ్‌తో ఇటీవలే ముగిసిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమైనా బౌలింగ్‌లో అదరగొట్టిన ముషీర్.. తాజాగా ఐర్లాండ్‌తో బ్యాటింగ్‌లోనూ మెరిశాడు.
A fantastic TON!
Young Musheer Khan impresses everyone at the big stage with a splendid century 👏👏
He departs for 118 off just 106 deliveries.
Follow the match ▶️ https://t.co/x26Ah72jqU#TeamIndia | #INDvIRE | #U19WorldCup pic.twitter.com/XfL7NIwOF4
— BCCI (@BCCI) January 25, 2024
ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో సర్ఫరాజ్ సెంచరీ మిస్ చేసుకున్నా రెండు ఇన్నింగ్స్‌లలోనూ మెరిశాడు. ఇక రెండో టెస్టులో అయితే బౌండరీలతో రెచ్చిపోయాడు. ఇంగ్లండ్ లయన్స్ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే ఆలౌట్ కాగా బ్యాటింగ్‌కు వచ్చిన భారత్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 489 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (58) రాణించగా ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ (105) సెంచరీ చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ తో పాటు వాషింగ్టన్ సుందర్ (57), సౌరభ్ కుమార్ (77)లు మెరవడంతో భారత్ భారీ స్కోరు చేసింది.
Sarfaraz Khan – 161(160) vs England Lions.
Musheer Khan – 118(106) vs Ireland.
A day to remember for brothers. 🇮🇳🔥 pic.twitter.com/FZBiJzx2VA
— Johns. (@CricCrazyJohns) January 25, 2024
రెండో టెస్టులో ఇండియా ఏ తరఫున ఆడుతున్న రింకూ సింగ్ (0), తిలక్ వర్మ (6)లు విఫలమయ్యారు. కానీ సర్ఫరాజ్ మాత్రం సెలక్టర్లు తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకున్నాడు. ఇద్దరు బ్యాటర్ల సెంచరీలు, ముగ్గురి హాఫ్ సెంచరీలతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్.. 337 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది.