Sarfaraz Khan | లక్నో: రంజీ చాంపియన్ ముంబై, రెస్టాఫ్ ఇండియా జట్ల మధ్య లక్నో వేదికగా జరుగుతున్న ఇరానీ కప్లో యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ద్విశతకం (276 బంతుల్లో 221 నాటౌట్, 25 ఫోర్లు, 4 సిక్సర్లు)తో మెరిశాడు. 237/4 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆరంభించిన ముంబై.. సర్ఫరాజ్ దూకుడుతో భారీ స్కోరు సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 536 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే (97) తృటిలో శతకం కోల్పోగా తనుష్ కొటియాన్ (64), శార్దూల్ ఠాకూర్ (36) రాణించారు.