పుణె: మిచ్చెల్ సాంట్నర్ తిప్పేశాడు. ఇండియన్ బ్యాటింగ్ లైనప్‌ను ఘోరంగా దెబ్బతీశాడు. కివీస్ స్పిన్నర్ ధాటికి టీమిండియా పుణె టెస్టు(Ind Vs Nz) ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్‌కు 103 పరుగుల ఆధిక్యం దక్కింది. ఫస్ట్ టెస్టులో ఓడిన రోహిత్ సేన.. రెండో టెస్టులోనూ పేలవంగా ఆడింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై.. భారత టాప్ ఆర్డర్ ముప్పుతిప్పలు పడింది.
సాంట్నర్ ఒక్కడే 19.3 ఓవర్లలో 53 రన్స్ ఇచ్చి ఏడు వికెట్లు తీసుకున్నాడు. 16 పరుగుల వద్ద ఇవాళ రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా.. కేవలం 140 రన్స్ జోడించి ఆలౌటైంది. లంచ్ టైంకు ఏడు వికెట్లకు 107 రన్స్ చేసిన ఇండియా.. ఆ తర్వాత 49 రన్స్ జోడించి మరో మూడు వికెట్లను కోల్పోయింది.
సాంట్నర్ టెస్టుల్లో తొలిసారి అయిదు వికెట్లను తన ఖాతాలను వేసుకున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సాంట్నార్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు భారత బ్యాటర్లు ఇబ్బందిపడ్డారు. 103 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసింది న్యూజిలాండ్.
Innings Break! #TeamIndia all out for 156.
Scorecard ▶️ https://t.co/YVjSnKCtlI #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/K7ir5j4a6G
— BCCI (@BCCI) October 25, 2024