Sanju Samson : వరల్డ్ కప్ హీరోగా పసుపు జెర్సీతో తొలి సీజన్ ఆడుతున్న సంజూ శాంసన్ (Sanju Samson) తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే బదులిచ్చాడు. పంతొమ్మిదో సీజన్ మూడు మ్యాచుల్లో నిరాశపరిచిన ఈ చిచ్చరపిగడుగు శతకంతో గర్జించాడు. చెన్నై సూపర్ కింగ్స్(CSK) కంచుకోటైన చిదంబరం స్టేడియంలో స్పెషల్ ఇన్నింగ్స్ ఆడిన సంజూ సెంచరీతో అభిమానులను అలరించాడు. పవర్ ప్లేలో దంచేసి.. అర్ధ శతకంతో ఫామ్ చాటుకున్న ఈ డాషింగ్ బ్యాటర్ కసిదీరా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను బాదేసి.. ఐపీఎల్లో నాలుగోసారి మూడంకెల స్కోర్‌తో మురిసిపోయాడు.
ఐపీఎల్లో తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ ధరించిన సంజూ శాంసన్ ఎట్టకేలకు తన ఎంపికపై న్యాయం చేశాడు. ట్రేడ్ డీల్‌లో తనను రూ.18 కోట్లకు కొనుకున్న చెన్నై యాజమాన్యం నమ్మకాన్ని నిలబెడుతూ శతక వందనం చేశాడు. మొదటి మూడు మ్యాచుల్లో 9, 7, 9 రన్స్‌తో నిరాశపరిచి.. విమర్శలపాలైన సంజూ ఈసారి తడబడలేదు.
𝗜𝗻𝗻𝗼𝘃𝗮𝘁𝗶𝘃𝗲. 𝗣𝗼𝘄𝗲𝗿𝗳𝘂𝗹. 𝗛𝗶𝗴𝗵𝗹𝘆 𝗜𝗺𝗽𝗮𝗰𝘁𝗳𝘂𝗹. 🔥
Drop an emoji for Sanju Samson’s performance tonight? 👇
Scorecard ▶️ https://t.co/BzGc6O65jX #TATAIPL | #KhelBindaas | #CSKvDC | @IamSanjuSamson pic.twitter.com/gI918IKo2i
— IndianPremierLeague (@IPL) April 11, 2026
భారీ స్కోర్ కొట్టాలనే ఒత్తిడిని బయటకు కనిపించనీయక.. ప్రపంచకప్‌లో మాదిరి తాపీగా బౌండరీలతో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఏ పొరపాటుకు తావివ్వని సంజూ 52 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో అతడికిది నాలుగో వంద కావడం విశేషం.
టీ20 ఫార్మాట్‌కు పక్కాగా సరిపోయే సంజూ శాంసన్ శతకాల్లోనూ మొనగాడే. గతంలో మూడుసార్లు మూడంకెల స్కోర్ సాధించిన సంజూ తాజా శతకంతో నాలుగోసారి ఈ ఫీట్ నమోదు చేశాడు. ఐపీఎల్లో తొలి సెంచరీని రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టుపై కొట్టాడు. 2017లో ఆర్పీఎస్ బౌలర్లపై విరుచుకుపడిన సంజూ 63 బంతుల్లోనే వంద బాదేశాడు.
📸📸
A 𝙎𝙖𝙣𝙟𝙪 𝙎𝙖𝙢𝙨𝙤𝙣 𝙎𝙥𝙚𝙘𝙞𝙖𝙡 in Chennai 🫡💯
Updates ▶️ https://t.co/BzGc6O65jX #TATAIPL | #KhelBindaas | #CSKvDC pic.twitter.com/u2TWFHmNYj
— IndianPremierLeague (@IPL) April 11, 2026
అనంతరం 2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 55బంతుల్లో.. 2021లో పంజాబ్ కింగ్స్‌పై 63 బంతుల్లో శాంసన్ శతకం కొట్టేశాడు. ఈసారి ఢిల్లీ క్యాపిటిల్స్పై 52 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడీ చిచ్చరపిడుగు. తద్వారా మురళీ విజయ్ తర్వాత ఢిల్లీపై శతకం బాదిన రెండో చెన్నై ఆటగాడిగా సంజూ రికార్డు నెలకొల్పాడు. పీఎల్ శతక వీరుల జాబితాలో విరాట్ కోహ్లీ (Virat Kohli) అగ్రస్థానంలో ఉండగా.. శభ్‌మన్ గిల్, డేవిడ్ వార్నర్‌లు సైతం నాలుగేసి సెంచరీలతో అభిమానులను అలరించారు.