అడిలైడ్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌కు ముందు జరుగుతున్న అడిలైడ్ టోర్నీలో భారత ఆటగాళ్లు రోహన్ బోపన్న-రామ్‌కుమార్ రామనాథన్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీస్‌లో భారత ద్వయం 6-2, 6-4తో టొమిస్లవ్ బ్రిక్ (బోస్నియా)-శాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో) జంటపై ఘన విజయం సాధించింది. తొలి సెట్ నుంచే ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన బోపన్న జోడీ.. హోరాహోరీగా సాగిన రెండో సెట్లో విజయం సాధించి తుదిపోరుకు దూసుకెళ్లింది. వరుస విజయాలతో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న భారత ద్వయం ఆదివారం జరిగే ఫైనల్లో ఇవాన్ డోడిగ్ (క్రోయేషియా)-మార్సెలో మెలో (బ్రెజిల్) జంటతో అమీతుమీ తేల్చుకోనుంది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్‌లో భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, నదియా కిచెనోక్ జోడీ నిరాశపర్చిన విషయం తెలిసిందే.