Sai Sangeeta | హైదరాబాద్, ఆట ప్రతినిధి: లక్నో వేదికగా జరుగుతున్న 22వ జాతీయ జూనియర్ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ అథ్లెట్ సాయిసంగీత పసిడి పతకంతో మెరిసింది. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో శిక్షణ పొందుతున్న సంగీత భారత జానియర్ అథ్లెటిక్స్ జట్టుకు ఎంపికైంది.
శనివారం జరిగిన మహిళల 400మీటర్ల రేసును సంగీత 55.13 సెకన్ల టైమింగ్తో అగ్రస్థానంలో నిలిచింది. అనుష్క, కనిస్టా ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు.