MI vs CSK : వరల్డ్ కప్ హీరో సంజూ శాంసన్ (101 నాటౌట్) ఐపీఎల్లో దంచేస్తున్నాడు. వరసగా రెండో సెంచరీతో చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ స్కోరందించాడు. వాంఖడే స్టేడియంలో టాపార్డర్ విఫలమైనా.. పట్టుదలగా ఆడిన శాంసన్ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. స్పిన్నర్ గజన్ఫర్(2-25), అశ్వనీ కుమార్(2-37) రెండేసి వికెట్లు తీసినా జోరు తగ్గించని సంజూ డెత్ ఓవర్లలో రెచ్చిపోయాడు. క్రిష్ భగత్ బౌలింగ్‌లో మూడు సిక్సర్లతో శతకం అందుకోవడంతో పాటు చెన్నై స్కోర్ రెండొందలు దాటించాడు.
టాస్ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. హార్దిక్ వేసిన రెండో ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్(22) గట్టిగానే అరుసుకున్నాడు. రెండు ఫోర్లు, సిక్సర్‌తో దడ పుట్టించాడు. మరో ఎండ్‌లో సంజూ శాంసన్(101 నాటౌట్ : 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు) సైతం ఉతికేసినా.. ఫామ్ అందుకున్నట్టే కనిపించిన గైక్వాడ్.. గజన్ఫర్(2-25) బౌలింగ్‌లో సిక్సర్ కొట్టబోయి తిలక్ వర్మకు దొరికాడు. దాంతో, 32 వద్ద చెన్నై తొలి వికెట్ పడింది. అనంతరం శాంట్నర్ ఓవర్లో వరసగా రెండు ఫోర్లు బాదిన సర్ఫరాజ్ ఖాన్ (15) అనూహ్యంగా నాలుగో బంతికి బౌల్డయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శివం దూబే(5)ను గజన్ఫర్ బౌల్డ్ చేసి రెండో వికెట్ సాధించాడు.
In style 😎
A rollicking way to reach a sensational HUNDRED 💯
Well played, @IamSanjuSamson 👏👏
Scorecard ▶️ https://t.co/gGt34dqUoq#TATAIPL | #KhelBindaas | #MIvCSK | @ChennaiIPL pic.twitter.com/ulFE1YPTc2
— IndianPremierLeague (@IPL) April 23, 2026
ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్నా శాంసన్ తడబడలేదు. డెవాల్డ్ బ్రెవిస్(21)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఉన్నంతసేపు దంచిన బ్రెవిస్‌కు అశ్వనీ కుమార్(2-37) చెక్ పెట్టాడు. ఒకదశలో చెన్నై 180 లోపే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ, డెత్ ఓవర్లలో గేర్ మార్చిన సంజూ.. బుమ్రా ఓవర్లో ఫోర్, భగత్ ఓవర్లో తొలి బంతికి సిక్సర్‌తో తొంభైలోకి వచ్చాడు. అదే ఊపులో బంతిని రెండుసార్లు స్టాండ్స్‌లోకి పంపిన శాంసన్ సెంచరీతో పాటు చెన్నై స్కోర్ రెండొందలు దాటించాడు. సంజూ విధ్వంసంతో చెన్నై నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.
Innings Break!
Sanju Samson takes #CSK to 207/6 with an unbeaten century 💯
Can #MI chase this down? 🧐
Scorecard ▶️ https://t.co/gGt34dqUoq#TATAIPL | #KhelBindaas | #MIvCSK pic.twitter.com/3QnTBuY7t1
— IndianPremierLeague (@IPL) April 23, 2026