IND vs ENG : ఇంగ్లండ్ పర్యటనలో తేలిపోతున్న భారత జట్టు తొలి విజయం కోసం పోరాడనుంది. ఇప్పటికే హ్యాట్రిక్ ఓటములతో టీ20 సిరీస్ చేజార్చుకున్న టీమిండియా.. సౌంతాప్టన్లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. వికెట్ పెద్దగా మారదనే ఉద్దేశంతో ఆతిథ్య జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు శ్రేయాస్ అయ్యర్. వరసగా విఫలమవుతున్న వైభవ్ సూర్యవంశీ స్థానంలో సంజూ శాంసన్ తుది జట్టులోకి వచ్చాడని అయ్యర్ తెలిపాడు.
వరసగా రెండో 20 సిరీస్ కోల్పోయిన భారత జట్టు వైట్‌వాష్‌ను తప్పించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డనుంది. చివరి మ్యాచ్‌లో విజయంతో పరువు దక్కించుకోవాలని శ్రేయాస్ అయ్యర్ సేన పట్టుదలతో ఉంది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు టాస్ పడాలి. కానీ, స్టేడియానికి బయల్దేరిన భారత జట్టు బస్సు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. దాంతో.. రాత్రి 7.15 గంటలకు టాస్ వేశారు. ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించిన అయ్యర్.. తుది జట్టులో రెండు మార్పులు చేసినట్టు చెప్పాడు.
India have won the toss and have opted to bowl first against England in the 5th T20I pic.twitter.com/sV4WM4EfND
— Cricinfo (@cricinfo) July 11, 2026
ఇంగ్లండ్ తుది జట్టు : ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెతెల్, టామ్ బ్యాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, డాసన్, ఆర్చర్, రషీద్, జోష్ టంగ్.
భారత తుది జట్టు : అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, సూర్యాన్ష్ షెడ్గే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్, ప్రిన్స్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ.