MI vs CSK : మాజీ ఛాంపియన్ల పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌దే పైచేయి. ఏకపక్ష మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించిన చెన్నై పంతొమ్మిదో సీజన్లో మూడో విజయం నమోదు చేసింది. వాంఖడే స్టేడియంలో సంజూ శాంసన్(101 నాటౌట్) మెరుపు శతకంతో భారీ స్కోరందించగా.. స్నిన్నర్లు అకీల్ హొసేన్(4-17), నూర్ అహ్మద్(2-24)లు ముంబై బ్యాటర్లను వణికించారు. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయిన ముంబై ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. హిట్టర్లంతా నట్టేట ముంచగా ముంబై 104కే కుప్పకూలగా సీఎస్కే భారీ విజయంతో రెండు పాయింట్లు సాధించింది.
ఐపీఎల్లో అతి గొప్ప పోరాటాల్లో ఒకటైన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పంజా విసిరింది. వాంఖడేలో సంజూ శాంసన్(101 నాటౌట్) శతక గర్జనతో ముంబై ఇండియన్స్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన చెన్నై స్పిన్నర్ల విజృంభణతో అదిరే విజయం సాధించింది. ఇంప్యాక్ట్ సబ్ అకీల్ హొసేన్(4-17) తన మొదటి ఓవర్లోనే ఓపెనర్ డానిష్ మలేవర్(0)ను ఔట్ చేసి షాకిచ్చాడు. ముకుల్ చౌదరీ ఓవర్లో డికాక్(7) బంతిని వికెట్ల మీదకు ఆడుకొని వెనుదిరిగాడు. తన రెండో ఓవర్లో డేంజరస్ నమన్ ధిర్(0)ను బౌల్డ్ చేసిన అకీల్ ముంబైని ఒత్తిడిలో పడేశాడు. 11 పరుగులకే మూడు కీలక వికెట్లు పడిన వేళ గత మ్యాచ్ సెంచరీ హీరో తిలక్ వర్మ(37), సూర్యకుమార్ యాదవ్(36)లు ఆచితూచి ఆడారు.
Timber strikes and joy in the @ChennaiIPL camp 🥳
Just the powerplay they wanted with the ball 💛#MI 30/3 after 7 overs.
Updates ▶️ https://t.co/gGt34dqUoq#TATAIPL | #KhelBindaas | #MIvCSK pic.twitter.com/OpqyCY0ZsQ
— IndianPremierLeague (@IPL) April 23, 2026
పెద్ద షాట్లకు వెళ్లకుండా సింగిల్స్, డబుల్స్.. చెత్త బంతుల్ని బౌండరీకి తరలించి స్కోర్ 50 దాటించారు. సూర్యతో కలిసి ముంబైని గట్టెక్కించాలనుకున్న తిలక్‌ను హొసేన్ బౌల్డ్ చేయడంతో నాలుగో వికెట్ 73 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 13వ ఓవర్లో నూర్ అహ్మద్ (2-24). హొసేన్ వరస బంతుల్లో హార్దిక్ పాండ్యా(1), రూథర్‌ఫొర్డ్(0)లను ఔట్ చేసి ముంబై ఓటమి అంచున నిలపగా.. తర్వాతి ఓవర్లో సూర్యను ఔట్ చేసిన హొసేన్ నాలుగో వికెట్‌తో చెన్నై విజయం ఖాయం చేశాడు. 103 పరుగుల తేడాతో గెలుపొందిన చెన్నై ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది.
టాస్ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. హార్దిక్ వేసిన రెండో ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్(22) గట్టిగానే అరుసుకున్నాడు. రెండు ఫోర్లు, సిక్సర్‌తో దడ పుట్టించాడు. మరో ఎండ్‌లో సంజూ శాంసన్(101 నాటౌట్ : 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు) సైతం ఉతికేసినా.. ఫామ్ అందుకున్నట్టే కనిపించిన గైక్వాడ్.. గజన్ఫర్(2-25) బౌలింగ్‌లో సిక్సర్ కొట్టబోయి తిలక్ వర్మకు దొరికాడు. దాంతో, 32 వద్ద చెన్నై తొలి వికెట్ పడింది. అనంతరం శాంట్నర్ ఓవర్లో వరసగా రెండు ఫోర్లు బాదిన సర్ఫరాజ్ ఖాన్ (15) అనూహ్యంగా నాలుగో బంతికి బౌల్డయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శివం దూబే(5)ను గజన్ఫర్ బౌల్డ్ చేసి రెండో వికెట్ సాధించాడు.
An innings that pushed @chennaiipl forward, an innings that held them together 👊
Sanju Samson with his 5️⃣th #TATAIPL ton tonight, staying unbeaten through the innings 👏
Scorecard ▶️ https://t.co/gGt34dqUoq#TATAIPL | #KhelBindaas | #MIvCSK pic.twitter.com/Kgf5FGl7IO
— IndianPremierLeague (@IPL) April 23, 2026
ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్నా శాంసన్ తడబడలేదు. డెవాల్డ్ బ్రెవిస్(21)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఉన్నంతసేపు దంచిన బ్రెవిస్‌కు అశ్వనీ కుమార్(2-37) చెక్ పెట్టాడు. ఒకదశలో చెన్నై 180 లోపే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ, డెత్ ఓవర్లలో గేర్ మార్చిన సంజూ.. బుమ్రా ఓవర్లో ఫోర్, భగత్ ఓవర్లో తొలి బంతికి సిక్సర్‌తో తొంభైలోకి వచ్చాడు. అదే ఊపులో బంతిని రెండుసార్లు స్టాండ్స్‌లోకి పంపిన శాంసన్ సెంచరీతో పాటు చెన్నై స్కోర్ రెండొందలు దాటించాడు. సంజూ విధ్వంసంతో చెన్నై నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.