Samit Dravid | న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కొడుకు సమిత్ ద్రవిడ్..అండర్-19 జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ల కోసం బీసీసీఐ జూనియర్ జట్లను శనివారం ప్రకటించింది. గత కొంత కాలంగా సమిత్ ద్రవిడ్ నిలకడగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న మహారాజా టీ20 ట్రోఫీలో బెంగళూరుకు ఆడుతున్న సమిత్ 82 పరుగులతో ఆకట్టుకున్నాడు. కర్ణాటక జట్టు కూచ్బెహార్ ట్రోఫీ విజేతగా నిలువడంలో సమిత్ కీలకంగా వ్యవహరించాడు. బ్యాటింగ్కు తోడు ఉపయుక్తమైన పేస్ బౌలర్గా జూనియర్ ద్రవిడ్ ఆసీస్తో సిరీస్లో కీలకంగా మారే అవకాశముంది. ఇదిలా ఉంటే పుదుచ్చేరి వేదికగా ఈనెల 21, 23, 26 తేదీల్లో ఆసీస్తో వన్డే సిరీస్ జరుగనుండగా, సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 7 వరకు నాలుగు రోజుల మ్యాచ్లకు చెన్నై వేదిక కానుంది.