Sam Curran | టీ 20 వరల్డ్ కప్ ఫైనల్స్ పాకిస్తాన్‌పై ఇంగ్లండ్ విజయం సాధించి కప్‌ను ఒడిసిపట్టింది. బెన్ స్ట్రోక్స్ తన పటిష్టమైన బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. అయితే, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా సామ్ కుర్రాన్ ఎంపికయ్యాడు. దీనిపై ఇంగ్లండ్ పేసర్ సామ్ కుర్రాన్ మరో రకంగా స్పందించాడు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు తనను ఎంపిక చేయడం సరికాదని సామ్ కుర్రన్ అభిప్రాయపడ్డారు. ఈ అవార్డు గెల్చుకునే అర్హత తనకు లేదని, నిజానికి ఈ అవార్డుకు తగిన వ్యక్తి బెన్ స్ట్రోక్స్ అని చెప్పాడు. మ్యాచ్ అనంతరం కుర్రన్ మాట్లాడుతూ.. ఫైనల్స్‌లో ఇంగ్లండ్ గెలిచిందంటే దానికి కారణం బెన్ స్ట్రోక్స్. ఆయన్నే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌కు ఎంపిక చేయడం సబబు.. అని అభిప్రాయపడ్డారు. స్ట్రోక్స్‌కు అవార్డు ఇవ్వాలని కుర్రన్ చెప్పి స్టేడియంలోని ప్రేక్షకుల హృదయాలను గెల్చుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో కేవలం 12 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ నడ్డి విరచడంలో సామ్ కుర్రన్ పాత్ర ఎంతో ముఖ్యమైనది. పాకిస్తాన్‌ను 20 ఓవర్లలో కేవలం 137 పరుగులకే పరిమితం చేసిన ఇంగ్లండ్.. తర్వాత పాకిస్తాన్ బౌలింగ్‌ను చితగ్గొట్టింది. బెన్ స్టోక్స్ అర్ధ సెంచరీ చేయడంతో ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్‌ను విజయం వరించింది.