న్యూఢిల్లీ: రెజ్లర్ సాక్షీ మాలిక్ తన స్వీయచరిత్రకు చెందిన ఓ పుస్తకాన్ని ఇటీవల రిలీజ్ చేసింది. 2016 రియో ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచిన ఆ స్టార్ తన జీవితంలో చోటుచేసుకున్న కొన్ని ఘటనలను గుర్తు చేసింది. రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై ఆమె తన బుక్‌లో లైంగిక వేధింపుల ఆరోపణ చేశారు. 2012 ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ కజకస్తాన్‌లోని ఆల్మటీలో జరిగింది. ఆ సమయంలో బ్రిజ్ తనను హోటల్ రూమ్‌లో లైంగికంగా వేధించినట్లు సాక్షీ మాలిక్ తన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నది. ఫోన్లో పేరెంట్స్‌తో మాట్లాడాల్సి ఉందని చెప్పి తననకు బ్రిజ్ హోటల్ రూమ్‌కు వెళ్లమన్నారని, కానీ అక్కడ జరిగిన సంఘటన తన జీవితంలో ఎంతో చేదు ఘటన అని ఆమె బుక్‌లో చెప్పారు.
బ్రిజ్ భూషణ్ సింగ్ తమ పేరెంట్స్‌తో ఫోన్ కలిపారని, అప్పటి వరకు హాని ఏమీ లేదనుకున్నానని, మ్యాచ్ గురించి.. మెడల్ గురించి పేరెంట్స్‌తో మాట్లాడానని, కానీ ఆ తర్వాత బ్రిజ్ మంచంపై కూర్చున్న సమయంలో.. అతను తనను లైంగికంగా వేధించినట్లు సాక్షీ తెలిపింది. అతన్ని నెట్టేసి, ఏడ్చుకుంటూ రూమ్‌కు వెళ్లినట్లు ఆమె తన బుక్‌లో రాసింది. తోసేయగానే, అతను వెనక్కి తగ్గాడని, తండ్రిలా చేతులు వేసినట్లు చెప్పాడని, కానీ అతను చేసింది అలా లేదని, ఏడ్చుకుంటూ రూమ్‌కు వెళ్లినట్లు సాక్షీ తన ఆటోబయోగ్రఫీలో రాసింది.
తన జీవితంలో గతంలో కూడా ఇలాంటి సంఘటన జరిగినట్లు ఆమె చెప్పారు. చిన్నతనంలో తన ట్యూషన్ టీచర్ అసభ్యకర రీతిలో టచ్ చేసినట్లు ఆమె గుర్తు చేసింది. ట్యూషన్ క్లాసులు తీసుకునేది ఉందని చెప్పి, ఇష్టం వచ్చిన టైంకు రమ్మనేవాడని, కొన్ని సందర్భాల్లో అతను తనను టచ్ చేసే ప్రయత్నం చేశాడని, ట్యూషన్‌కు వెళ్లాలంటే భయం అయ్యేదని, ఈ విషయాన్ని అమ్మకు చెప్పేందుకు కూడా భయపడేదాన్ని అని ఆమె ఆ బుక్‌లో రాసింది.