ఆదివారం 29 మార్చి 2020
Sports - Jan 30, 2020 , 19:02:38

బీజేపీలోకి సైనా నెహ్వాల్‌

 బీజేపీలోకి సైనా నెహ్వాల్‌

న్యూఢిల్లీ: భారత స్టార్‌ షట్లర్‌, లండన్‌ ఒలింపిక్‌ కాంస్య పతక విజేత  సైనా నెహ్వాల్‌.. భారతీయ జనతా పార్టీలో చేరింది. దేశం కోసం నిరంతరం కష్టపడుతున్న ప్రధాని  మోదీ తనకు స్ఫూర్తిప్రదాత అని చెప్పింది. దేశానికి బీజేపీ ఎంతో మేలు చేస్తున్నదని,  దేశాభివృద్ధిలో తానూ భాగస్వామినవుతానని తెలిపింది. దేశరాజధానిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌.. సైనా నెహ్వాల్‌తో పాటు ఆమె సోదరి అబూ చంద్రాన్షుకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, సైనా తదుపరి లక్ష్యం మాత్రం టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమేనని ఆమె తండ్రి హర్వీర్‌ సింగ్‌ తెలిపారు.   


logo