హైదరాబాద్, ఆట ప్రతినిధి: జపాన్ వేదికగా ఈ ఏడాది జరిగే ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర యువ సెయిలర్లు సురగాని ఈశ్వ, కొమురవెల్లి లహరి చెమటోడుస్తున్నారు. దేశం తరఫున ఆసియా గేమ్స్‌లో ప్రాతినిధ్యం వహించాలన్న ఏకైక ధ్యేయంతో ముందుకు సాగుతున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన ఈశ్వ, లహరి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడ గా రాణిస్తున్నారు.
హైదరాబాద్ యాచింగ్ క్లబ్‌కు చెందిన తమ కోచ్ సుహేమ్ షేక్ ఈ ఇద్దరు సెయిలర్లు కఠోర శిక్షణ తీసుకుంటున్నారు. ప్రస్తుతం లహరి ‘స్కిప్పర్’గా, ఈశ్వ ‘క్రూ’గా వ్యవహరిస్తున్నారు. రాను న్న అంతర్జాతీయ టోర్నీల్లో రాణించడం ద్వారా ఆసియాగేమ్స్‌కు అర్హ త సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ సందర్భంగా సుహేమ్ షేక్ మాట్లాడుతూ లహరి ఇప్పటికే ఎంతో అనుభవం సంపాదించగా, ఈశ్వ తక్కువ సమయంలోనే అద్భుత ప్రతిభతో ఆకట్టుకుంటున్నదని అన్నారు.