INDA vs SLA : రెండో అనధికారిక టెస్టులో భారత- ఏ బ్యాటర్ల దంచేస్తున్నారు. గాలే స్టేడియంలోఓపెనర్ సాయి సుదర్శన్ (87 నాటౌట్), దేవ్‌దత్ పడిక్కల్(74 నాటౌట్) అర్ధ శతకాలతో కదం తొక్కారు. శ్రీలంక ఏ బౌలర్లను ఉతికేసిన ఈ ద్వయం శతక భాగస్వామ్యం నెలకొల్పగా ఇండియా-ఏ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. సెంచరీకి చేరువైన వీరిద్దరూ.. చేతిలో మరో తొమ్మిది వికెట్లు ఉండడంతో ఆతిథ్య జట్టు స్కోర్‌ను దాటేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లడం ఖాయం.
శ్రీలంక పర్యటనలో భారత -ఏ జట్టు ధీటుగా ఆడుతోంది. తొలి అనధికారిక టెస్టు డ్రాగా ముగియడంతో రెండో మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా ఇండియా-ఏ బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. లంక ఏ బౌలర్లను బెంబేలెత్తిస్తూ ఓపెనర్ సాయి సుదర్శన్(87 నాటౌట్), దేవ్‌దత్ పడిక్కల్(74 నాటౌట్) అర్ధ శతకాలతో రెచ్చిపోయారు.
The Sai Sudharsan show continues! ⭐
A century followed by a fifty—another statement performance from one of India’s brightest young batters.#SaiSudharsan #IndiaA #Cricket pic.twitter.com/T2dhKGN3Tp
— Cricadium (@Cricadium) July 3, 2026
ఓపెనర్ అమన్ మొఖాడే(38) విఫలైమనా.. ఆతిథ్య జట్టుకు ఊపిరి సలవనివ్వని ఈ జోడీ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది. ఫలితంగా.. 50 ఓవర్లకు వికెట్ నష్టానికి 194 కొట్టిన భారత్ ఇంకా 172 పరుగుల వెనబడింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత -ఏ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఏను గొప్పగా కట్టి చేసింది. కెప్టెన్ సహన్ అరాచ్చిగా(127) శతకం బాదినా.. మిగతా బ్యాటర్లు తేలిపోయారు. గుర్నూర్ బ్రార్, సరాన్ష్ జైన్ నాలుగేసి వికెట్లు తీయగా.. లంక నాలుగ్గొందలలోపే పరిమితమైంది. బ్రార్, జైన్ ధాటికి ఆతిథ్య లంక 366 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో యశ్ ఠాకూర్ రెండు వికెట్లతో రాణించాడు.