న్యూఢిల్లీ : మాజీ క్రికెటర్ యశ్పాల్ శర్మ మృతి ఇవాళ మృతిచెందిన విషయం తెలిసిందే. 1983 క్రికెట్ వరల్డ్‌కప్‌లో ఆడిన యశ్పాల్.. ఇవాళ ఉదయం గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. యశ్పాల్ మృతి బాధాకరం అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు. 83 వరల్డ్ కప్‌లో అతని ప్రదర్శన అసాధారణమన్నారు. యశ్పాల్ కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Sad to hear about the demise of cricketer Yashpal Sharma. His remarkable performances during the key matches in 1983 cricket World-Cup played a crucial role in one of India’s greatest triumphs in cricketing history. My deepest condolences to his family, followers & team members.
— President of India (@rashtrapatibhvn) July 13, 2021
యశ్పాల్ మృతి పట్ల మాజీ క్రికెటర్లు సంతాపం తెలిపారు. యశ్పాల్ మృతి ఎంతో షాక్‌కు గురి చేసిందని సచిన్ టెండూల్కర్ తెలిపారు. 1983 వరల్డ్‌కప్‌లో అతని బ్యాటింగ్ శైలిని చూసి ఎంజాయ్ చేసేవాడినన్నారు. ఎన్నో జ్ఞాపకాలు మిగిలి ఉన్నాయన్నారు. భారతీయ క్రికెట్‌కు ఆయన అందించిన భాగస్వామ్యం మరవలేనిదని సచిన్ తెలిపారు. శర్మ కుటుంబానికి నివాళి అర్పించారు.
Shocked and deeply pained by the demise of Yashpal Sharma ji. Have fond memories of watching him bat during the 1983 World Cup. His contribution to Indian cricket shall always be remembered.
— Sachin Tendulkar (@sachin_rt) July 13, 2021
My sincere condolences to the entire Sharma family. pic.twitter.com/WBQ6ng2x8I
కేంద్ర క్రీడాశాక మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా నివాళి అర్పించారు. వరల్డ్ కప్ విన్నింగ్ సభ్యుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. అతని కెరీర్ అద్భుతంగా సాగిందన్నారు. 83 వరల్డ్‌కప్‌లో రెండవ అత్యధిక స్కోరర్ అతనే అని తెలిపారు. అంపైర్‌గా, సెలెక్టర్‌గా ఆయన చేసిన సేవలు మరిచిపోలేమని మంత్రి తన ట్వీట్లో తెలిపారు.
Saddened by the passing away of ace cricketer & 1983 World Cup winning member Sh Yashpal Sharma.
— Anurag Thakur (@ianuragthakur) July 13, 2021
He had an illustrious career & was India's second-highest run getter at the 1983 World Cup. He was also an umpire and national selector. His contribution won’t be forgotten.
ॐ शांति pic.twitter.com/fhra6UcngV
వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, వెంకటేశ్ ప్రసాద్, అనిల్ కుంబ్లే, శిఖర్ ధావన్.. ఇంకా అనేక మంది క్రికెటర్లు యశ్పాల్ మృతి పట్ల నివాళి అర్పించారు.
So sorry to hear about #YashpalSharma Paaji 's passing away, one of the heroes of our 1983 WC win. Heartfelt condolences. Om Shanti. pic.twitter.com/Toh3wLHNAw
— Virender Sehwag (@virendersehwag) July 13, 2021