Masters League | రాయ్‌పూర్ : మాజీ క్రికెటర్లు ప్రాతినిథ్యం వహించిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 తొలి సీజన్ టైటిల్‌ను సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని ఇండియా మాస్టర్స్ గెలుచుకుంది. వెస్టిండీస్ మాస్టర్స్‌తో రాయ్‌పూర్ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో ఇండియా.. 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బ్రియాన్ లారా సారథ్యంలోని వెస్టిండీస్.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులకే పరిమితమైంది.
సిమ్మన్స్ (57) టాప్ స్కోరర్ కాగా డ్వేన్ స్మిత్ (45) రాణించాడు. లక్ష్యాన్ని ఇండియా.. 17.1 ఓవర్లలోనే ఛేదించింది. వికెట్ కీపర్ బ్యాటర్ అంబటి రాయుడు (50 బంతుల్లో 74, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సచిన్ (18 బంతుల్లో 25, 2 ఫోర్లు, 1 సిక్స్) తనదైన ట్రేడ్‌మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. యువరాజ్ (13 నాటౌట్), బిన్నీ (16 నాటౌట్) లాంచనాన్ని పూర్తిచేశాడు.