Sachin Tendulkar | లండన్: వింబుల్డన్‌లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు సముచిత గౌరవం లభించింది. శనివారం వింబుల్డన్ సెంట్రల్ కోర్టులో మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన సచిన్‌కు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగుల వీరుడు, వరల్డ్‌కప్ విజేత సచిన్‌కు వెల్కమ్ అంటూ వ్యాఖ్యాత ప్రకటించడంతో ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారు. మరోవైపు రాయల్బాక్స్లో సచిన్ సహా ఇంగ్లండ్ క్రికెటర్లు బెన్‌స్టోక్స్, జోరూట్, జోస్ బట్లర్ హాజరై మ్యాచ్‌ను ఆస్వాదించారు.
100 అడుగుల అభిమానం!
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ధోనీ పట్ల తమ అభిమానాన్ని ఫ్యాన్స్ ఘనంగా చాటుకున్నారు. ఆదివారం ధోనీ పుట్టిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామలో అభిమానులు ఏకంగా 100 అడుగులతో ప్రత్యేకంగా కటౌట్ ఏర్పాటు చేశారు. అంబారుపేట హైవే పక్కన ఉన్న ఈ కటౌట్ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.