SA20 : మూడు సీజన్లుగా అభిమానులను అలరించిన దక్షిణాఫ్రికా టీ20 లీగ్ మరో ఎడిషన్‌కు సిద్ధమవుతోంది. ఈ ఏడాది డిసెంబర్ 26 నుంచి నాలుగో సీజన్ షురూ కానుంది. మెగా టోర్నీకి సమయం దగ్గరపడుతున్నందున శుక్రవారం షెడ్యూల్ విడుదల చేశారు నిర్వాహకులు. న్యూలాండ్స్‌లోని కేప్‌టౌన్ మైదానంలో సంబురంగా సీజన్‌ను ప్రారంభించనున్నారు. ఇదే వేదికపై ఫైనల్ ఫైట్ నిర్వహిస్తామని లీగ్ కమిషనర్ గ్రేమ్ స్మిత్ (Graeme Smith) వెల్లడించాడు.
‘బెట్‌వే ఎస్ఏ20 నాలుగో సీజన్ క్రికెట్ అభిమానులకు ఈ వేసవిలో అమితమైన వినోదాన్ని పంచనుంది. సెప్టెంబర్ 9న ఆటగాళ్ల వేలం నిర్వహిస్తున్నాం. క్రిస్మస్ తెల్లారి.. బాక్సింగ్ డే (డిసెంబర్ 26)న మెగా టోర్నీ మొదలవ్వనుంది. గతేడాది న్యూలాండ్స్‌లో జరిగిన ఐదు మ్యాచ్‌ల టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. అందుకే.. ఈసారి ఇదే మైదానంలో ఆరంభ వేడుకలు నిర్వహించాలనుకుంటున్నాం. ఫైనల్ మ్యాచ్ కూడా ఇక్కడే జరుగుతుంది. తొలిసారి డర్బన్‌లో క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడించాలని భావిస్తున్నాం’ అని స్మిత్ వివరించాడు.
𝐀𝐋𝐋 𝐑𝐎𝐀𝐃𝐒 𝐋𝐄𝐀𝐃 𝐓𝐎 𝐍𝐄𝐖𝐋𝐀𝐍𝐃𝐒 🏆
Want to secure your tickets? Make sure you’ve registered for Early Access 🔗 https://t.co/Odp1OUwl3c#BetwaySA20 pic.twitter.com/81DQ3JlO2i
— Betway SA20 (@SA20_League) August 22, 2025
నాలుగో సీజన్లో ఎంఐ కేప్‌టౌన్ (MI Cape Town) డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగుపెట్టనుంది. తొలి రెండు ఎడిషన్లలో విజేతగా నిలిచిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు.. మూడో సీజన్లో మాత్రం టైటిల్ వేటలో తడబడింది. నాలుగో సీజన్ విషయానికొస్తే.. ఓపెనింగ్ మ్యాచ్‌లో ఎంఐ కేప్‌టౌన్, డర్బన్స్ సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. క్వాలిఫయర్ 1 జనవరి 21న డర్బన్‌లో జరుగనుంది. జనవరి 23న సెంచూరియన్‌లో ఎలిమినేటర్.. జొహన్నెస్‌బర్గ్‌లో జనవరి 24న క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లు ఉంటాయి.