Fanny Utagushimaninde : పొట్టి క్రికెట్లో అబ్బాయిలే కాదు అమ్మాయిలు తమ తడాఖా చూపిస్తున్నారు. తమదైన పవర్ హిట్టింగ్తో ఈతరం మహిళా క్రికెటర్లు తొలి మ్యాచ్‌లోనే రికార్డులు బద్ధలు కొడుతున్నారు. అరంగేట్రంలో అదిరే ఆటతో శతకంతో చరిత్ర సృష్టించింది పదిహేనేళ్ల అమ్మాయి. రువాండా జట్టు తరఫున మెరుపు ఇన్నింగ్స్‌తో సెంచరీ బాదిన ఫాన్నీ ఉతగ్షీమనిండే (Fanny Utagushimaninde) నయా రికార్డు నెలకొల్పింది.
‘గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది’ అన్నది అన్నట్టు.. చిన్న దేశానికి చెందిన ఫాన్నీ ఉతగ్షీమనిండే చరిత్రను లిఖించింది. అంతర్జాతీయ క్రికెట్లో తన ఆగమనాన్ని ఘనంగా చాటుతూ తొలి మ్యాచ్‌లోనే వంద కొట్టేసింది. శనివారం ఘనా జట్టుపై సునామీ ఇన్నింగ్స్ ఆడిన ఫాన్నీ.. 65 బంతుల్లో 111 పరుగులతో అజేయంగా నిలిచింది. టీ20ల్లో మొట్టమొదటి మ్యాచ్‌లోనే వంద కొట్టిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచిన తను.. మహిళల టీ20ల్లో మూడంకెల స్కోర్ కొట్టిన చిన్న వయస్కురాలిగా మరో రికార్డు తన పేరిట రాసుకుంది.
15-year-old Fanny Utagushimaninde debuts with a massive 111 (65) vs Ghana.
✅ 1st woman to score a T20I debut century
✅ Youngest T20I centurion (15 years and 223 days)
A star is born. The future is Rwandan.#RwandaCricket #RisingStar #T20I pic.twitter.com/H6AOloYRAy— Rwanda Cricket Association (@RwandaCricket) March 20, 2026
తూర్పు ఆఫ్రికాలోని రువాండా క్రికెట్లో కొత్త తార పుట్టుకొచ్చింది. ఫాన్నీ ఉతగ్షీమనిండే విధ్వంసక ఆటతో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో శతకంతో రెచ్చిపోయింది. 15 ఏళ్ల 223 రోజుల వయసులో పొట్టి క్రికెట్లో అరంగేట్రం చేసిన తను.. ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీతో కదం తొక్కింది. ఫానీ ధాటికి గతంలో అత్యధిక స్కోర్ (96 నాటౌట్)తో రికార్డు నెలకొల్పిన కరెన్ రోల్టన్(ఇంగ్లండ్) రెండో స్థానానికి పడిపోయింది. అరంగేట్రంలోనే 90 పరుగులు చేసిన స్టెఫానీ టేలర్(వెస్టిండీస్) మూడో స్థానంలో కొనసాగుతోంది.
15-year-old Fanny Utagushimaninde makes a record-breaking debut 🔥👏#CricketTwitter pic.twitter.com/TFjncFuN4U
— Female Cricket (@imfemalecricket) March 21, 2026