Ruth Chepngetich | చికాగో: కెన్యా అథ్లెట్ రుత్ చెప్నెగెటిక్ మారథాన్ పరుగు పందెంలో సరికొత్త చరిత్ర లిఖించింది. ట్రాక్ మీద తనకు తిరుగులేదని మరోసారి చాటిచెబుతూ రెండు నిమిషాల తేడాతో రికార్డులు బద్దలుకొట్టింది. సోమవారం చికాగో వేదికగా జరిగిన మారథాన్ పోటీలలో 30 ఏండ్ల చెప్నెగెటిక్.. 2 గంటల 09 నిమిషాల 56 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. గతంలో ఈ రికార్డు ఇథియోపియా అథ్లెట్ టిగిస్ట్ అస్పెఫా పేరిట (2:11:53 ని.) పేరిట ఉండేది.