బెంగళూరు: యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ (108; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో న్యూజిలాండ్-‘ఎ’తో జరుగుతున్న అనధికారిక మూడో టెస్టులో భారత్-‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్-‘ఎ’ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. రుతురాజ్ ఒక్కడే ఇన్నింగ్స్‌కు ఇరుసులా నిలబడగా.. వికెట్ కీపర్ ఉపేంద్ర యాదవ్ (76; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అతడికి కాస్త సహకారం అందించాడు. ప్రియాంక్ (5), సర్ఫరాజ్ ఖాన్ (0), రజత్ పాటిదార్ (30), అభిమన్యు (38), శార్దూల్ ఠాకూర్ (7) విఫలమయ్యారు.