క్లీవ్‌లాండ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా క్లీవ్‌లాండ్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. అమెరికాలోని ఒహాయోలో ఆదివారం జరిగిన డబ్ల్యూటీఏ-250 టోర్నీ మహిళల డబుల్స్ ఫైనల్లో సానియా-క్రిస్టినా మెక్హల్ (అమెరికా) జోడీ 5-7, 3-6తో టాప్ సీడ్ షుకో అయామ-ఎనా షిబహారా (జపాన్) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. గంటా 24 నిమిషాల పాటు సాగిన పోరులో సానియా జోడీ వరుస సెట్లలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ ప్రదర్శనతో సానియా మీర్జా 180 ర్యాంకింగ్ పాయింట్స్ ఖాతాలో వేసుకుంది.