ఈ ఐపీఎల్లో అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన కెప్టెన్లలో రాజస్థాన్ రాయల్స్ సారధి సంజూ శాంసన్ ఒకడు. ఆ జట్టు ఆడిన తొలి క్వాలిఫైయర్‌లో కూడా శాంసన్ టాస్ ఓడాడు. అయితే బెంగళూరు జట్టుతో జరుగుతున్న రెండో క్వాలిఫైయర్‌లో శాంసన్ టాస్ గెలిచాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తాము మొదట బౌలింగ్ చేస్తామని వెల్లడించాడు.
అలాగే తొలి క్వాలిఫైయర్ ఓటమి గురించి జట్టు ఆలోచించలేదని, ప్రాక్టీస్ సెషన్ చాలా అద్భుతంగా సాగిందని వెల్లడించాడు. తమ జట్టులో ఎలాంటి మార్పులూ లేవని తెలిపాడు. బెంగళూరు సారధి డుప్లెసిస్ మాట్లాడుతూ తాము ముందుగా బ్యాటింగ్ చేయాలని అనుకున్నామని చెప్పాడు. తమ జట్టులో కూడా ఎలాంటి మార్పులూ లేకుండానే బరిలో దిగుతున్నట్లు వెల్లడించాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, వానిందు హసరంగ, హర్షల్ పటేల్, జోష్ హాజిల్‌వుడ్, మహమ్మద్ సిరాజ్
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ, ఓబెడ్ మెకాయ్
🚨 Team News 🚨@rajasthanroyals & @RCBTweets remain unchanged.
Follow the match ▶️ https://t.co/orwLrIaXo3 #TATAIPL | #RRvRCB
A look at the Playing XIs 🔽 pic.twitter.com/Typ7SmkRsX
— IndianPremierLeague (@IPL) May 27, 2022
🚨 Toss Update 🚨@rajasthanroyals have elected to bowl against @RCBTweets.
Follow the match ▶️ https://t.co/orwLrIaXo3 #TATAIPL | #RRvRCB pic.twitter.com/RxSqb19C3s
— IndianPremierLeague (@IPL) May 27, 2022