RR vs LSG | నాలుగో వికెట్ కోల్పోయిన లక్నో.. 10 ఓవర్లకు స్కోరు ఎంతంటే?
లక్నో కష్టాలు తీరడం లేదు. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయిన లక్నో.. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకునేలా కనిపించడం లేదు. పవర్‌ప్లే ముగిసేలోపే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును దీపక్ హుడా (25) ఆదుకున్నట్లే కనిపించాడు. రిస్కీ షాట్లు ఆడకుండా ఓపెనర్ డీకాక్ (17 నాటౌట్)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించేలా కనిపించాడు.
కానీ పదో ఓవర్ తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న కుల్దీప్ సేన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన హుడా.. బంతిని మిస్ అయ్యాడు. దాంతో ఆ బంతి వికెట్లను కూల్చింది. దీపక్ హుడా నిరాశగా మైదానం వీడగా.. రాజస్థాన్ శిబిరం సంబరాల్లో మునిగిపోయింది. ఈ ఐపీఎల్లో నిలకడగా ఆడుతున్న లక్నో ప్లేయర్లలో హుడా ఒకడన్న విషయం తెలిసిందే.
జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ ఆదుకుంటూ వచ్చిన హుడా కూడా అవుటవడంతో లక్నో విజయావకాశాలు దెబ్బతిన్నట్లే కనిపిస్తోంది. అయితే క్రీజులో క్వింటన్ డీకాక్ ఉండటంతో ఇంకా అభిమానుల్లో గెలుపు ఆశలు చావలేదు. ప్రస్తుతం పది ఓవర్లు ముగిసే సరికి లక్నో జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- ipl 2022
- RR vs LSG
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

