ఢిల్లీ 75 ఆలౌట్
ఐపీఎల్-19లో డిఫెండింగ్ చాంపియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరోసారి అదరగొట్టింది. ఆ జట్టు బౌలర్లు నిప్పులు చెరగడంతో ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను తమ సొంతగడ్డపై 9 వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించి చిన్నస్వామిలో తమను ఓడించిన క్యాపిటల్స్‌పై ఘనంగా బదులు తీర్చుకుంది.
- బెంగళూరు భారీ విజయం
- క్యాపిటల్స్‌కు అవమానకర ఓటమి
- హాజిల్‌వుడ్, భువనేశ్వర్ పేస్‌కు దాసోహం
ఢిల్లీ: ఐపీఎల్-19లో డిఫెండింగ్ చాంపియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరోసారి అదరగొట్టింది. ఆ జట్టు బౌలర్లు నిప్పులు చెరగడంతో ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను తమ సొంతగడ్డపై 9 వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించి చిన్నస్వామిలో తమను ఓడించిన క్యాపిటల్స్‌పై ఘనంగా బదులు తీర్చుకుంది. మొదట జోష్ హాజిల్‌వుడ్ (4/12), భువనేశ్వర్ కుమార్ (3/5) విజృంభించడంతో డీసీ.. 16.3 ఓవర్లలో 75 పరుగులకే చాప చుట్టేసింది. అభిషేక్ పొరెల్ (33 బంతుల్లో 30, 3 ఫోర్లు), డేవిడ్ మిల్లర్ (18 బంతుల్లో 19, 3 ఫోర్లు) ఆదుకోకుంటే ఆ జట్టు పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉండేది. నామమాత్రపు ఛేదనను ఆర్సీబీ.. 6.3 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి దంచేసింది. దేవ్‌దత్ పడిక్కల్ (13 బంతుల్లో 34 నాటౌట్, 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లీ (15 బంతుల్లో 23 నాటౌట్, 1 ఫోర్, 2 సిక్స్‌లు) పవర్ ప్లేలోనే దంచేశారు.
ఢిల్లీ ఢమాల్
0, 1, 1, 0, 5, 0.. పవర్ ప్లేలో భువీ, హాజిల్‌వుడ్ బెంబేలెత్తించడంతో 3.5 ఓవర్లలో ఢిల్లీ టాప్, మిడిలార్డర్ బ్యాటర్ల ప్రదర్శన ఇది! బంతి బ్యాట్‌ను తాకితే క్యాచ్.. వదిలిపెడితే బౌల్డ్ అన్న రేంజ్లో ఆర్సీబీ పేస్ ద్వయం చెలరేగడంతో క్యాపిటల్స్ గజగజా వణికిపోయింది. 4 ఓవర్లు కూడా పూర్తికాకముందే డీసీకి చెందిన ఆరుగురు ప్రధాన బ్యాటర్లు కనీసం డబుల్ డిజిట్ కూడా స్కోరు చేయకుండా పెవిలియన్‌కు చేరారంటే భువీ, జోష్ బౌలింగ్ విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇన్నింగ్స్ రెండో బంతికే సాహిల్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి వికెట్ల పతనానికి భువీ శ్రీకారం చుడితే.. హాజిల్‌వుడ్ రెండో ఓవర్ వరుస బంతుల్లో కేఎల్ రాహుల్ (1)తో పాటు సమీర్ రిజ్విని ఔట్ చేసి ఆతిథ్య జట్టు కష్టాలను రెట్టింపు చేశాడు.
తానేం తక్కువ తిన్నానా అన్నట్టుగా భువీ మూడో ఓవర్లో ప్రమాదకర స్టబ్స్ (5)తో పాటు కెప్టెన్ అక్షర్‌ను డకౌట్ చేయడంతో డీసీ ఏడు పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. 9 బంతులాడిన నితీశ్ రాణా (1) హాజిల్‌వుడ్ ఓవర్లో పడిక్కల్‌కు చిక్కాడు. స్కోరుబోర్డుపై పరుగుల కంటే వికెట్ల సంఖ్య పెరుగుతున్న క్రమంలో మిల్లర్, ఇంపాక్ట్ ప్లేయర్‌గా క్రీజులోకి వచ్చిన పొరెల్ క్యాపిటల్స్ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. బెంగళూరు బౌలర్ల జోరుకు ఎదురొడ్డి నిలిచిన ఈ జోడీ.. 5 ఓవర్ల పాటు క్రీజులో ఉండి 31 బంతుల్లో 35 పరుగులు జోడించింది. తద్వారా ఐపీఎల్లో ఆర్సీబీ పేరిటే ఉన్న అత్యల్ప స్కోరు (49) రికార్డును ఆ జట్టు అధిగమించడంతో డీసీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే రసిక్ 9వ ఓవర్లో మిల్లర్.. జితేశ్‌కు క్యాచ్ ఇవ్వడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. మిల్లర్ నిష్క్రమించినా పొరెల్ మాత్రం పట్టుదలగా క్రీజులో నిలిచాడు. జెమీసన్ (12) అండతో ఆ జట్టు స్కోరును 60 పరుగుల మార్కు దాటించాడు. కృనాల్ ఓవర్లో జెమీసన్ నిష్క్రమించగా పొరెల్‌ను బౌల్డ్ చేసిన హాజిల్‌వుడ్.. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
అవలీలగా దంచారు!
స్వల్ప ఛేదనను డిఫెండింగ్ చాంపియన్స్ దాదాపు పవర్ ప్లేలో (65/1)నే బాదేసింది. బౌండరీతో పరుగుల వేట మొదలెట్టిన బెతెల్ (11 బంతుల్లో 20, 1 ఫోర్, 2 సిక్స్‌లు) జెమీసన్ మూడో ఓవర్లో రెండు భారీ సిక్స్‌లు బాదాడు. కానీ ఐదో బంతిని నటరాజన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మూడో స్థానంలో వచ్చిన పడిక్కల్.. చమీర నాలుగో ఓవర్లోనే 6, 4 బాదగా జెమీసన్ ఓవర్లో 6, 4, 4, 6తో 21 రన్స్ పిండుకున్నాడు. నటరాజన్ ఏడో ఓవర్లో రెండు సిక్స్‌లతో కోహ్లీ లాంఛనాన్ని పూర్తిచేశాడు.
- 13/6 ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యల్ప పవర్ ప్లే (1-6 ఓవర్లు) స్కోరు. 2009లో రాజస్థాన్ (14/2) కూడా బెంగళూరుతో మ్యాచ్‌లో ఇలాగే తడబడింది.
- ఈ లీగ్‌లో 9వేల (9,012) పరుగుల మైలురాయిని అధిగమించిన తొలి బ్యాటర్ కోహ్లీ. ఈ జాబితాలో రోహిత్ (7,183) రెండో స్థానంలో ఉన్నాడు.
- ఢిల్లీకి ఈ లీగ్‌లో ఇది మూడో అత్యల్ప స్కోరు. గతంలో ముంబై (66), పంజాబ్ (67)పై లోయెస్ట్ స్కోర్లను నమోదుచేశాయి.
సంక్షిప్త స్కోర్లు
ఢిల్లీ: 16.3 ఓవర్లలో 75 ఆలౌట్ (పొరెల్ 30, మిల్లర్ 19, హాజిల్‌వుడ్ 4/12, భువనేశ్వర్ 3/5); బెంగళూరు: 6.3 ఓవర్లలో 77/1 (పడిక్కల్ 34*, కోహ్లీ 23*, జెమీసన్ 1/42)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinidhi Shetty | ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు తీసుకుంటున్నానా .. ప్రచారాలపై శ్రీనిధి శెట్టి క్లారిటీ..!
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

