టాప్-2లో బెంగళూరు
పాయింట్ల పట్టికలో టాప్-2 లక్ష్యంగా ఈ సీజన్లో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. కీలక పోరులో బంతితో విఫలమైనా బ్యాట్‌తో దుమ్మురేపింది.
- లక్నోపై ఆర్సీబీ భారీ విజయం
- జితేశ్ కెప్టెన్ ఇన్నింగ్స్
- పంత్ శతకం వృథా
- ఐపీఎల్లో ముగిసిన లీగ్ దశ
లక్నో: పాయింట్ల పట్టికలో టాప్-2 లక్ష్యంగా ఈ సీజన్లో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. కీలక పోరులో బంతితో విఫలమైనా బ్యాట్‌తో దుమ్మురేపింది. మంగళవారం లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు.. ఆరు వికెట్ల తేడాతో ప్రత్యర్థిని ఓడించింది. లక్నో నిర్దేశించిన 228 పరుగుల భారీ ఛేదనను బెంగళూరు.. 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి దంచేసింది. ఛేదనలో తాత్కాలిక సారథి జితేశ్ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్, 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపులకు తోడు విరాట్ కోహ్లీ (30 బంతుల్లో 54, 10 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ (23 బంతుల్లో 41 నాటౌట్, 5 ఫోర్లు) రాణించారు.
మొదట బ్యాటింగ్ చేసిన లక్నోకు.. రిషభ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్, 11 ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ శతకంతో చెలరేగగా మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్-18లో లీగ్ దశ ముగిసింది. ఈ మ్యాచ్ ఫలితం అనంతరం బెంగళూరు, పంజాబ్ తలా 19 పాయింట్లతో సమానంగా ఉన్నా నెట్న్ రేట్ విషయంలో కింగ్స్ మెరుగ్గా ఉండటంతో ఆర్సీబీ రెండో స్థానానికి పరిమితమైంది. ఈనెల 29న పంజాబ్, బెంగళూరు క్వాలిఫయర్-1 ఆడనుండగా 30న జరిగే ఎలిమినేటర్‌లో గుజరాత్.. ముంబైతో తలపడనుంది.
రిషభ్, మార్ష్ ధనాధన్
లక్నో ఇన్నింగ్స్‌లో పంత్ ఇన్నింగ్సే హైలైట్. సీజన్ ఆసాంతం విఫలమైన అతడు.. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో తానేంటో నిరూపించే ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ బ్రీట్జ్ (14).. లక్నో స్కోరు 25 పరుగుల వద్దే ఔట్ అవడంతో క్రీజులోకి వచ్చిన పంత్.. మార్ష్‌తో కలిసి బౌండరీలు, సిక్సర్లతో చెలరేగాడు. వచ్చీరాగానే యశ్ దయాల్ 4వ ఓవర్లో 6, 4, 4తో బాదుడు మొదలుపెట్టిన పంత్.. భువనేశ్వర్ ఓవర్లో 6, 4 దంచాడు. సుయాశ్ బౌలింగ్‌లో రెండు బౌండరీలతో 29 బంతుల్లోనే అతడి అర్ధ శతకం పూర్తయింది. మరో ఎండ్‌లో మార్ష్ సైతం షెపర్డ్ బౌలింగ్ ఫోర్, సిక్సర్ కొట్టగా సుయాశ్ ఓవర్లో సిక్స్‌తో ఈ సీజన్లో 7వ హాఫ్ సెంచరీ నమోదుచేశాడు. ఈ క్రమంలో భువీ 16వ ఓవర్లో మార్ష్‌ను ఔట్ చేయడంతో లక్నో రెండో వికెట్ కోల్పోయింది. రెండో వికెట్‌కు పంత్-మార్ష్ ద్వయం 78 బంతుల్లోనే 152 పరుగులు జోడించింది. భువీనే వేసిన 18వ ఓవర్లో ఐదో బంతిని బౌండరీకి తరలించిన పంత్ 54 బంతుల్లో శతకాన్ని నమోదుచేశాడు.
కోహ్లీ, జితేశ్ దూకుడు
ఛేదనలో బెంగళూరు ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెన్ ఫిల్ సాల్ట్ (30), కోహ్లీ లక్నో బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డారు. సాల్ట్‌ను ఆకాశ్ ఆరో ఓవర్లో పెవిలియన్‌కు పంపగా ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన రజత్ పటీదార్ (14) విఫలమయ్యాడు. లివింగ్‌స్టొన్ డకౌట్ అవగా అర్ధ శతకం తర్వాత కోహ్లీ కూడా నిష్క్రమించడంతో బెంగళూరు శిబిరంలో ఆందోళన మొదలైంది. కానీ జితేశ్.. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో చెలరేగి మ్యాచ్‌ను ముగించాడు. మయాంక్ అతడికి చక్కటి సహకారం అందించాడు.
సంక్షిప్త స్కోర్లు
లక్నో: 20 ఓవర్లలో 227/3 (పంత్ 118*, మార్ష్ 67, తుషారా 1/26, భువనేశ్వర్ 1/46); బెంగళూరు: 18.4 ఓవర్లలో 230/4 (జితేశ్ 85*, కోహ్లీ 54, ఓరూర్క్ 2/74, అవేశ్ 1/32)

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

